బాలీవుడ్ నుండి హాలీవుడ్ ఎక్స్ పోర్ట్ అయిన హాట్ బ్యూటీ దీపికా పదుకునే ఈమధ్య తన మీద ఎలాంటి చిన్న గాసిప్పు వచ్చినా కస్సు బుస్సు మని లేస్తుంది. ఇంతకీ దీపికాకు ఇప్పుడ
కోపం తెప్పించిన విషయం ఏంటి అంటే చామన చాయ అందంతోనే కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్న ఈ సుందరి స్కిన్ వైటెనింగ్ ట్రీట్మెంట్ చేయించుకుందని టాక్.


ఈ విషయం అమ్మడిదాకా వెళ్లేసరికి నాకు రంగు పిచ్చున్న వాళ్లంటేనే చిరాకు మరి అలాంటిది నేనెందుకు అలా చేస్తాను. మన రంగు మనం డిసైడ్ చేయలేమేమో కాని మనసు రంగు మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని ఉపోద్ఘాతం చేస్తుంది. వైట్ పేపర్ లా ఉంటే మంచిదంటున్న దీపికా ఒకవేళ అది నలుపుగా మారినా దాన్ని తెల్లగా మార్చుకునేందుకు కష్టపడతా అంటుంది.


బాలీవుడ్ లో హాట్ హాట్ ఎఫైర్స్ తో సంచలనం సృష్టించిన దీపికా ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ తో డేటింగ్ చేస్తుందట. ట్రిపులెక్స్ రిటర్న్ తో హాలీవుడ్ లోకి వెళ్లిన అమ్మడు అక్కడ నీళ్లు బాగానే పడ్డట్టు ఉన్నాయి. అందుకే ఇన్నాళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగిన రణ్ వీర్ సింగ్ ను ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోవట్లేదట.



మరింత సమాచారం తెలుసుకోండి: