ఇంగ్లీష్ నవలలను ఇంగ్లీష్ సినిమాలను అనుసరిస్తూ చాల సినిమాలు మన తెలుగులో ఇప్పటికే ఎన్నో వచ్చాయి.  ఇటువంటి సినిమాలలో మన టాప్ హీరోలు కూడ నటించారు. అయితే దీనికి భిన్నంగా జూనియర్ నటించిన ఒక మూవీ కథ యధాతధంగా ఇంగ్లీష్ నవలగా రాబోతూ ఉండటం అత్యంత సంచలనంగా మారింది. 

జూనియర్ కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీగా పేరు గాంచిన టెంపర్ తారక్ కు నటుడుగా చాల మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటి వరకు పరాజయాల బాటలో నడుస్తున్న జూనియర్ ను తిరిగి హిట్ ట్రాక్ పైకి తీసుకు వచ్చి విజయాలను మాత్రమే కాకుండా అనేక అవార్డులను కూడ తెచ్చి పెట్టిన మూవీ టెంపర్.  

ఇప్పుడీ మూవీ నవలగా రాబోతోంది. ఈ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ కథను నవలగా   ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన హారీపొట్టర్ సిరీస్ ను పబ్లిష్ చేసిన బ్లూమ్స్ బెర్రీ సంస్థ ‘టెంపర్’ నవలను ఇంగ్లీష్ లో ప్రచురించ బోతోంది. బ్లూమ్స్ బెర్రీ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 

నోబుల్ బహుమతితో పాటు బుకర్ ప్రైజ్, పులిట్జర్, ఆరెంజ్ ప్రైజ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని అందుకున్న నవలల్ని ఈ కంపెనీ ప్రచురించిన ట్రాక్ రికార్డు ఉంది. అటువంటి ప్రముఖ సంస్థ ‘టెంపర్’ సినిమాను నవలగా ప్రచురించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘టెంపర్’ సినిమాలో జూనియర్ పోషించిన దయ పాత్ర ఆ మూవీకి అత్యంత కీలకం. ఈపాత్రను సినిమాలో కంటే ఈ నవలలో ఇంకా అద్భుతంగా రచయిత వక్కంతం వంశీ ఈ ఇంగ్లీష్ నవలలో చాల బాగా డిజైన్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఒక టాప్ హీరో నటించిన ఒక సినిమా కథను ఇంగ్లీష్ నవలగా మారబోతున్న రికార్డు కూడ జూనియర్ సొంతం కావడం మరొక విశేషం. ఏమైనా ఈ వార్తలతో జూనియర్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: