టాప్ హీరోలు తాము నిర్మించే సినిమాలకు డేట్స్ ఇస్తే చాలు అని ఎందరో నిర్మాతలు ఎదురు చూస్తున్న పరిస్థితుల నేపధ్యంలో ఒక ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్  టాప్ హీరోలను  టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి హాట్ న్యూస్ గా మారాయి. స్టార్‌ హీరోల సినిమాలు టర్నోవర్‌ కి పనికొస్తున్నాయే తప్ప వాటితో లాభాలు లేవని కేవలం పెద్ద సినిమా రిలీజ్‌ చేసామనే పేరు కోసమే బయ్యర్లు రిస్క్‌ చేస్తున్నారు తప్ప పెద్ద చిత్రాలు కొనడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ నామా సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

వంద రూపాయల టికెట్‌ లో అన్నీ పోను మిగిలే షేర్‌ నలభై రూపాయలు మాత్రమేనని  అయితే కేవలం టాక్స్‌ మాత్రం తీసేసి దానినే షేర్‌ గా చెప్పుకుంటూ ఒక విధమైన మయా ప్రపంచంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బతుకు తున్నారు అంటూ అభిషేక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఒక సంచలనంగా మారింది. అంతే కాదు స్టార్‌ హీరోల సినిమాల కంటే నాని, శర్వానంద్‌, నిఖిల్‌ లాంటి హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీని నడిపిస్తున్నారని, వాళ్ల సినిమాల మీదే ఎవరికైనా నాలుగు రూపాయలు మిగులుతున్నాయని అంటూ అభిషేక్ చేసిన కామెంట్స్ టాప్ హీరోలను టార్గెట్ చేసేవిగా మారాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
నైజాంలో గతంలో నలభై మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారని అయితే  ఇప్పుడు తనతో పాటు సునీల్‌, దిల్‌ రాజు మాత్రం మిగిలామని ఇదే పద్ధతి కొనసాగుతూపోతే డిస్ట్రిబ్యూటర్లు కనుమరుగు అయిపోతారని అంటూ  అభిషేక్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుత ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితికి దర్పణంగా మారాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పంపిణీదారునిగా కెరియర్ మొదలు పెట్టిన అభిషేక్ నిర్మాతగా మారి సినిమాలు కూడ తీస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం పంపిణీదారులు ఇలా నష్టపోతే సినీ ఇండస్ట్రీకే ప్రమాదం కాబట్టి దీనికి పరిష్కారంచప వలసిన భాద్యత కూడ టాప్ హీరోల పై ఉంది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వస్తున్నా ఈ విషయాల పై దృష్టి పెట్టే ఓపికా తీరికా నేటి టాప్ హీరోలకు ఏమాత్రం లేదు అన్నది మాత్రం వాస్తవం. భారీ సినిమాల వల్ల ఎందరో నిర్మాతలు మరెందరో డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతున్నా టాప్ హీరోల సినిమాల మర్కేట్ కు మాత్రం ఎదురు లేదు అన్నది వాస్తవం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: