64 వ జాతీయ అవార్దులలో టాలీవుడ్ హవా కనిపించడమేకాకుండా ‘పెళ్ళి చూపులు’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలకు అవార్డులు రావడం అత్యంత సంచలనంగా మారింది. కొద్దిసేపటి ఢిల్లీలో నిర్వ‌హించిన ఒక ప్రత్యేక మీడియా స‌మావేశంలో 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 

అయితే ఈ అవార్డులలో గత సంవత్సరం అతి చిన్న సినిమాగా విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాకు 2 ఆవార్డులు. ‘జనతా గ్యారేజ్’ సినిమాకు ఒక అవార్డు రావడంతో టాలీవుడ్ లోని అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

దీనికితోడు ఇటీవల ‘ఐఫా’ అవార్డులలో  ‘పెళ్లి చూపులు’ సినిమాను చిన్న చూపు చూసారు అంటూ ఈసినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ఆవేదనను వ్యక్తం చేయడమే కాకుండా సినిమాలకు ఇచ్చే అవార్డులన్నీ పైరవీలతో వస్తున్నాయని ప్రతిభకు స్థానం లేకుండా పోతోంది అని తరుణ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే జాతీయ స్థాయిలో అవార్డ్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇది ఇలా ఉండగా ‘శతమానం భవతి’ కూడ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక కావడంతో టాలీవుడ్ సినిమా రంగం మరింత జోష్ లో ఉంది. ఎప్పటిలాగే మన దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఏ హీరోకి ఈ నేషనల్ అవార్డ్స్ లో స్థానం లభించలేదు. అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడానికి ఈ నెలలో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ కనీసం వచ్చే సంవత్సరం అయినా ఎన్ని అవార్డులు తెచ్చి పెడుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: