తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.  కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన మహేష్ బాబు తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ భారీ డిజాస్టర్ అయ్యింది.  అయితే తర్వాత వచ్చే సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్న మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ తో ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుగా జరుతూ వస్తుంది..కానీ ఇప్పటి వరకు మహేష్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ కాలేదు.  కాకపోతే మద్యలో మాత్రం సినిమా టైటిల్ పై రక రకాల వార్తలు వచ్చాయి.  
స్పైడర్ : మహేష్ 23 లుక్ వచ్చేసింది..!
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ఇదిగో అదిగో అంటూ చాలాకాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారే, తప్ప దాని ఫస్ట్ లుక్ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేకపోయింది ఆ చిత్ర బృందం. అయితే ఇన్నాళ్ళకు మహేష్ ఫ్యాన్స్ ఆశలు నెరవేరే రోజు రాణే వచ్చింది. ఈ రోజు మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూసే రోజు, అభిమానులు ఆనందంతో గెంతులు వేసే రోజు వచ్చేసింది.  మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
Image result for మహేష్ బాబు ఫస్ట్ లుక్
తన ప్రతీ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మురుగదాస్ ఈ లుక్ కోసం కూడా భారీ కసరత్తులే చేశాడు. అందుకు తగ్గట్టుగా అవుట్ పుట్ కూడా దుమ్ములేపే విధంగా వచ్చింది.  ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గూఢాచారిగా నటిస్తున్నాడు.  ఓ పోస్టర్ లో టీషర్ట్ వేసుకుని.. చేతిలో గన్ తో సీరియస్ గా ఉంటాడు. శత్రువుపై ఎటాక్ చేసే సీన్ కు సంబంధించిన సీన్ అది. మరొకటి రొమాంటిక్ లుక్.
Image result for murugadoss mahesh
అయినా చేతిలో గన్ పట్టుకుని ఉండటం విశేషం. స్పైడర్ లుక్స్ ఔట్ అండ్ ఔట్ గా చూస్తే.. జేమ్స్ బాండ్ ను గుర్తుకుతెచ్చాడు మహేష్ బాబు.  సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: