సాధార‌ణంగా హీరోయిన్ అవ‌కాశాలు త‌గ్గాకో, లేదంటే - కెరీర్ చివ‌రి ద‌శ‌లోనో ఐటెమ్ గాళ్స్ అవ‌తారం ఎత్తుతుంటారు మన ముద్దుగుమ్మ‌లు. అయితే క‌థానాయికగా ఛాన్స్‌లు వ‌స్తున్న టైమ్‌లోనే సింగంలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది అంజ‌లి. ఏమిటో అనుకొన్నాం గానీ - ఒంపు సొంపుల‌తో బాగానే అల‌రించింది. డ్ర‌స్సుల విష‌యంలో ఏమాత్రం మొహమాట‌ప‌డ‌లేదు. ఏం వేసుకోమంటే అది వేసుకొంది.

సింగంలో అంజ‌లి ఊపులు చూసి - ఏమిటి మ‌న అంజ‌లీనే..?  అనుకొన్నారంతా!  కాపేపే అయినా అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకొనేలా చేసింది. ఇక ముందు కూడా ఇలాంటి హాట్ గీతాల్లో న‌ర్తించ‌డానికి త‌న‌కేమాత్రం అభ్యంత‌రం లేద‌ని నిరూపించుకొంది. నిజానికి గ్లామ‌ర్ పాత్ర‌లంటే ఈ సీత‌మ్మ‌కు ఆస‌క్తే. అయితే ఆమెను ఆ దృష్టితో ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న ద‌ర్శ‌కులు చూళ్లేదు. సింగంతో మ‌న‌సు మార్చుకొంటారేమో?

��

''ప్ర‌త్యేక గీతం అని ఒప్పుకోలేదు. సూర్య సినిమా అని సై అన్నా. ప్ర‌త్యేక గీతాల‌పై నాకు ఆస‌క్తి లేదు. కానీ ఏమాత్రం టెమ్టింగ్ గా ఉన్నా ఒప్పుకొంటా.'' అంటోంది. అంటే అంజ‌లిని ప్ర‌త్యేక గీతాల‌కు ఒప్పించాలంటే ముందు టెంప్ట్ చేయాల‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: