తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన హీరో ఒక్క చిరంజీవి మాత్రమే.  అయితే ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో పోటీగా నిలుస్తూ..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన డ్యాన్స్,ఫైట్స్ తో అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన హీరో చిరంజీవి. ఈయన వేసిన బాటలో ఇప్పుడు అరడజను మంది మెగా హీరోలు ఇండస్ట్రీలో తమ సత్తూ చూపిస్తున్నారు.  అయితే మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ గతంలో పెద్దగా పాపులారిటీ రాలేదు కానీ గత కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Image result for chiranjeevi shastipurthi
చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాన్ ల మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయని..వారు కలుసుకోవడం అసాధ్యమని వార్తలు వచ్చాయి.  కానీ వీటన్నింటికి పులిస్టాప్ పెడుతూ చిరంజీవి షష్టిపూర్తికి పవన్ కళ్యాన్ హాజరు కావడం..సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో అన్నయ్య సెట్స్ లోకి రావడం ఇలా ఇద్దరి మద్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదని మీడియా ముందు కనిపించారు.  అయితే మెగా హీరోల ఫంక్షన్లకు మాత్రం పవన్ రాకపోవడం పై చాలా విమర్శలు వస్తున్నాయి.  చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్.
Image result for mega heroes
వీళ్లిద్దరూ చాలా సార్లు బహిరంగంగా తమ మధ్య విభేదాలు ఏమీ లేవని ప్రకటించినా వీటికి ఫుల్ స్టాప్ పడలేదు. పైగా మెగా హీరోలతో జరిపే ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న చోటుచేసుకోవడం షరా మామూలే.  తాజాగా మిస్టర్ రిలీజ్ సందర్భంగా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని,  ఓ కుటంబ సభ్యుడిగా ఇలాంటి వార్తలు ప్రారంభంలో తనను చాలా బాధపెట్టేవన్నారు.
Image result for mister movie
ఓ ఫ్యామిలీ మెంబర్‌గా నిజమేంటనేది తనకు తెలుసునని.. తమ ఫ్యామిలీ గురించి కామెంట్లు చేయడానికి బయటవారికి ఏం తెలుసన్నారు వరుణ్ తేజ్.  కాకపోతే రాజకీయంగా వారు భిన్నదారుల్లో వెళ్తున్నారు కావొచ్చు..కానీ మా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్నారు.  ఇదే విషయం గురించి పదే పదే వివరణ ఇవ్వాల్సిరావడం చాలా అసౌకర్యంగా ఉంటుందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: