తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య వరుస విజయాలతో దూసుకు వెళ్లిన దర్శకులు శ్రీనువైట్ల.  స్టార్ హీరోలతో అద్భుతమైన చిత్రాలు అందించిన శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ చిత్రాలతో భారీ అపజయాలు చవిచూశాడు.  దీంతో ఇండస్ట్రీలో ఈ దర్శకుడి గురించి బాగా నెగిటీవ్ టాక్ వచ్చింది.  అంతే కాదు కొంత మంది హీరోలు కూడా ఆయనకు దూరంగా ఉన్నారన్న టాక్ కూడా వచ్చింది.  అయితే తన తదుపరి చిత్రంతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్న శ్రీను మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  
Related image
అంతే కాదు శ్రీనువైట్లకు ఇది చాలా కీలకమైన చిత్రం. భారీ తారాగణం ఉండడం, ట్రైలర్, మిక్కిజేమేయర్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉండడంతో ఈచిత్రం పై మంచి అంచనాలు పెంచాయి.  మరోవైపు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ మంచి విజయాలు అందుకున్న మెగా అబ్బాయి వరుణ్ తేజ్ కు ఆ మద్య రిలీజ్ అయిన ‘లోఫర్’ నెగిటీవ్ టాక్ తెచ్చింది.  దీంతో ఈ కుర్ర హీరో కూడా మంచి విజయం సాధించాలన్న కసిమీద ఉన్నాడు.  ఇక యూఎస్ లో మొదటి షో వివరాలను సినిమా మొదటి భాగం అంతా మంచి కామెడీతో కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఉన్నాయట.
Image result for mister movie posters
 వాస్తవానికి శ్రీను వైట్ల చిత్రాలు అంటే కామెడీకి మంచి ప్రాధాన్యత ఉంటుంది.  ఫస్ట్ హాఫ్ లో కమెడియన్లు పృథ్వి , శ్రీనివాస్ రెడ్డి పండించిన కామెడీ బావుంది. మొదటి అర్ధభాగం మొత్తం ప్రేక్షుకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అయితే సెకండ్ ఆఫ్ లో సినిమా గ్రామీణ వాతావరణంలో సాగుతుంది..పగలు ప్రతీకారాలతో సినిమా సీరియస్ గా సాగింది.  
Image result for mister movie posters
తెలుగులో చాలా చిత్రాల్లో వచ్చిన రొటీన్ కథనే చూపించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..హెబా పటేల్, లావణ్య త్రిపాఠి ల గ్లామర్ అదిరిపోయింది. వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్, మంచి లొకేషన్ లలో చిత్రీకరించిన పాటలు, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. మరి థియేటర్లలో ప్రేక్షకులు సాయంత్రం వరకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో..రేపు ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్నదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: