తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  గత సంవత్సరం సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం నిరాశపరిచినా..ఆ సినిమా పై క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు భారీ అంచనాల రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత కలెక్షన్ల పరంగా బాగానే పుంజుకుంది.  

A still from Katamarayudu

తర్వాత వెంకటేష్ నటించిన గురు చిత్రంతో కాటమరాయుడు కలెక్షన్లకు కాస్త బ్రేక్ పడింది.  సినిమాపై నెగిటీవ్ టాక్ వస్తూ ఉండటంతో కలెక్షన్లపై బాగా దెబ్బపడింది.  అయితే పవన్ కళ్యాన్ ఇమేజ్ తో కలెక్షన్లు బాగానే వస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది.  మొత్తానికి కాటమ రాయుడు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు కానీ మంచి వసూళ్ల నే సాధించింది .

Image result for katamarayudu movie first day collection

ప్రపంచ వ్యాప్తంగా కాటమ రాయుడు చిత్రం 62 కోట్లకు పైగా షేర్ ని  వసూల్ చేసింది . సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కున్న క్రేజ్ తో ఈమాత్రం వసూళ్లు చేయగలిగింది . ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం మొదటి రోజు రూ.23 కోట్లు రాబట్టింది.  తొమ్మిదేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

తాజాగా ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించి ఫైనల్ గా ఏరియా వైజ్ గా కలెక్షన్లు. 

నైజాం                          -  15. 54 కోట్లు 

సీడెడ్                         -   8. 3 కోట్లు 

ఉత్తరాంధ్ర                 -   6. 3 కోట్లు 

ఈస్ట్                            -   5. 35 కోట్లు 

వెస్ట్                             -   4. 22 కోట్లు 

గుంటూరు                   -   4. 97 కోట్లు 

కృష్ణా                            -  3. 65 కోట్లు 

నెల్లూరు                       -  2. 08 కోట్లు 

కర్ణాటక                         -  5. 47 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా      -  1. 30 కోట్లు 

యు ఎస్ ఏ                   - 3. 42కోట్లు 

రెస్ట్ ఆఫ్ వరల్డ్              -  1. 50 కోట్లు 

మొత్తం                       -   62. 1 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: