ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తాను నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు సంబంధించి తాను నటిస్తున్న మూడు పాత్రల పై సీరియస్ గా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈసినిమాలోని మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ లుక్స్ లో కనబడబోతున్న జూనియర్ ఎట్టి పరిస్తుతులలోను ఈసినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఈమూవీ కోసం తెగ కష్టపడుతున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈసినిమా షూటింగ్ స్పాట్ లో ఉన్న జూనియర్ ను నిన్న కొంతమంది అభిమానులు కలిసి అతడి పై వస్తున్న రకరకాల రూమర్ల విషయం ప్రస్తావించినట్లు టాక్. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా వర్గాలలో జూనియర్ పేరును లింక్ చేసి వస్తున్న ‘నవభారత్ నేషనల్ పార్టీ’ విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

ఈవిషయాలు తన అభిమానుల నోటివెంట విన్న వెంటనే జూనియర్ చిరునవ్వుతో సమాధానం ఇస్తూ తాను ఇటువంటి వార్తలను పట్టించుకోనని తన అభిమానులు కూడా ఇటువంటి వార్తలను లెక్క చేయవద్దు అని సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనే ఉందని తాను నటించవలసిన సినిమా ప్రాజెక్ట్స్ వరస పెట్టి క్యూలో ఉన్న నేపధ్యంలో మరో మూడు సంవత్సరాల వరకు తనకు వేరే విషయాలు ఆలోచించే తీరికలేదు అని జూనియర్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు తాను రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే తాను బహిరంగంగా ప్రకటన చేసి వస్తాను కానీ తాను ఇలా రహస్యంగా వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రాజకీయాలలోకి రావలసిన అవసరం తనకు లేదు అని కామెంట్స్ చేసినట్లు జూనియర్ అభిమానుల వర్గం ద్వారా సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రకటించింది. 

దీనితో గత కొద్ది రోజులుగా మీడియాలో హడావిడి చేస్తున్న జూనియర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలకు చెక్ పడినట్లే అనుకోవాలి. అయితే రాజకీయాలలో ఏ అభిప్రాయం ఎవరికీ స్థిరంగా ఉండదు కాబట్టి ఈ విషయమై రానున్న రోజులలో అనుకోని ట్విస్టులు వచ్చినా ఆశ్చర్యం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: