నందమూరి అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న నందమూరిసింహం బాలకృష్ణ ముద్దుల కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై ఇప్పడు ప్రచారంలోకి వచ్చిన షాకింగ్ రూమర్ అందరికీ షాక్ ఇస్తోంది.  ప్రస్తుతం 22 ఏళ్ల వయస్సులో మంచి అందగాడుగా అందరి మార్కులు అప్పుడే వేయించుకున్న మోక్షజ్ఞ నటించబోయే మొదటి సినిమా గురించి ఇప్పటినుంచే నందమూరి అభిమానులు కలలు కంటున్నారు. 

నందమూరి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలనే తలంపుతో బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి అనేక ఇంటర్వ్యూలలో లీకులు ఇవ్వడమే కాకుండా సరైన టైమ్, సరైన డైరక్టర్ కోసం అన్వేషణ చేస్తున్నాడు ఆన్న వార్తలు కూడ వచ్చాయి. దీనికి సంబంధించి బాలకృష్ణ తనకు సన్నిహితంగా ఉండే దర్శకులతో రచియితలతో చర్చలు కూడ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి, ఇలాంటి టాప్ లైన్ డైరక్టర్ల్ లలో ఎవరో ఒకరిచేత మోక్షజ్ఞ తొలి సినిమాకు డైరెక్ట్ చేయించే ఆలోచనలలో బాలకృష్ణ ఉన్నట్లు వార్తలు కూడ ఉన్నాయి. వాస్తవానికి  మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా నిర్మించడానికి బాలయ్యతో మంచి అనుబంధం ఉన్న కొర్రపాటి సాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అనే వార్తలు కుడా ఉన్నాయి. 

అయితే ప్రస్తుతం  టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్  గాసిప్పుల ప్రకారం మోక్షజ్ఞకు సినిమాల మీద అంతగా ఆసక్తిలేదు అని అంటున్నారు.  మోక్షజ్ఞకు సినిమాల మీదకన్నా బిజినెస్ లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్టార్ట్ చేయడం మీదనే ఆసక్తి ఎక్కువగా వుందని తెలుస్తోంది. 

బిజినెస్ రంగంలో బాగా పైకి ఎదుగాలని, ఎంతో సాధించాలని మోక్షజ్ఞ కలలు కంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలో ప్రస్తుతం ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది అని అంటున్నారు. అయితే  పిల్లల విషయంలో చాలా క్రమశిక్షణ పాటించే  బాలకృష్ణ సినిమాల్లోకి రమ్మంటే, మోక్షజ్ఞ కాదనే అవకాశం అంతగా ఉండకపోవచ్చు అని నందమూరి కుటుంబ సన్నిహితులు అంటున్నట్లు టాక్. ఏది ఏమైనా ఈ విషయమై క్లారిటీ రావడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: