మహేష్ సూపర్ స్టార్ గా నిలబెట్టిన ఒక్కడు సినిమా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అప్పటికే స్టార్డం వచ్చినా మహేష్ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది ఒక్కడు సినిమా. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కేవలం తెలుగులోనే కాదు రీమేక్ అయిన ప్రతి చోటా సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఒక్కడు కోలీవుడ్ రీమేక్ గిల్లి విజయ్ హీరోగా నటించాడు.  


ఆ సినిమా ఇళయదళపతి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థరణి డైరెక్ట్ చేసిన ఆ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. అయితే ఆ సినిమాకు సీక్వల్ గా గిల్లి-2 కథ రెడీ చేస్తున్నాడట ఈ తమిళ దర్శకుడు. పవన్ కళ్యాణ్ బంగారం సినిమాను డైరెక్ట్ చేసిన ఈ డైరక్టర్ కుదిరితే ఆ స్క్రిప్ట్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నాడట.


ఇప్పటికే విజయ్ తో కథా చర్చలు జరిపాడట ధరణి. విజయ్ ఓకే చెప్పేస్తే మూవీ స్టార్ట్ చేయడమే అంటున్నాడు. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఒక్కడు సీక్వల్ చేయాలని మహేష్ కాని గుణశేఖర్ కాని అనుకోలేదు. ధరణి మాత్రం ఒక్కడు-2 అదేనండి గిల్లి-2 చేసి తీరుతా అంటున్నాడు. ఇదో రకంగా మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అన్నట్టే.


ఆ చెప్పే కథ ఏదో మహేష్ ను కూడా కన్విన్స్ చేసేలా చెబితే ఇక్కడ మహేష్ అక్కడ విజయ్ ఇద్దరు కలిసి ఒక్కడు-2 చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ తమిళ దర్శకుడు మురుగదాస్ తో స్పైడర్ మూవీ చేస్తున్నాడు. జూన్ 23న రిలీజ్ అనుకున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయట.



మరింత సమాచారం తెలుసుకోండి: