తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ తర్వాత నటుడిగా మారారు.  స్టైల్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తిన లారెన్స్ ‘ముని’ లాంటి హర్రర్, కామెడీ, థ్రిల్లర్ కాన్సెప్ట్ ఉన్న చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.  ఇదే కాన్సెప్ట్ తో కాంచన, గంగ లాంటి సినిమాతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించాడు.  తాజాగా ఇదే కాన్సెప్ట్ తో ‘శివలింగ’ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు.  గతంలో ‘చంద్రముఖి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ చిత్రానికి దర్శకులు.  

Image result for shivalinga  telugu movie stills

కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘శివలింగ’ అదే పేరు తో రిమేక్ చేసి తెలుగు, తమిళంలో రిలీజ్ చేశారు.  రాఘవ లారెన్స్ హీరోగా నటించిన శివలింగ చిత్రానికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది అయితే హర్రర్ చిత్రాలకు లారెన్స్ కేరాఫ్ అడ్రస్ కావడంతో మొదటి వారం మంచి వసూళ్ల నే సాధించింది.  రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న శివలింగ కలెక్షన్లు కాస్త తగ్గుతూ వచ్చాయి.  

Image result for shivalinga  telugu movie stills

అనుకున్న రేంజ్ లో షేర్ రాలేదు కానీ 6 కోట్ల షేర్ ఓ డబ్బింగ్ చిత్రానికి రావడం గొప్పే మరి . తెలంగాణ లో 2 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేయగా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 4కోట్ల షేర్ రాబట్టింది . మొత్తంగా 6. 09 కోట్ల షేర్ వచ్చింది శివలింగ చిత్రానికి . లారెన్స్ గత చిత్రాల మాదిరిగా సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో రాఘవ సరసన ‘గురు’ హీరోయిన్ రితికా సింగ్ నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: