ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలటే…వరుస సక్సెస్ లను చూస్తున్నవారికే తెలుస్తుంది. తన ప్రతి మూవీలోనూ సక్సెస్ స్టార్ కాస్టింగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే విధంగా నితిన్ వరుస సక్సెస్ లను చూస్తున్నారు. ”అ ఆ” తరువాత సెలెక్టివ్జ్ గా సినిమాలు చేస్తున్న హీరో నితిన్...ప్రస్తుతం అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో లై సినిమా చేస్తున్నాడు.


ఇక మూవీలో సక్సెస్ లో ఉన్న స్టార్ట్స్ ని, యాక్టర్స్ ని మాత్రమే తీసుకునేందుకు నితిన్ చూస్తున్నారు. ఇదిలా ఉంటే తన మూవీల వేగాన్ని కూడ నితిన్  పెంచారు. ఈ సినిమా తరువాత నితిన్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. చైతన్య కృష్ణ దర్శకత్వంలో రానున్న ఆ సినిమా మే చివర్లో మొదలు కానుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని అంటున్నారు. అలాగే హీరోయిన్ ని కన్ఫర్మ్ చేశారు.


నితిన్ కు జోడిగా మెహ్రిన్ కౌర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రిన్ కౌర్ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే మొదటగా మెహ్రిన్ కౌర్ బాలీవుడ్ లో సినిమాలకి చేస్తున్నానని…టాలీవుడ్ లో నటించని చెప్పిందట. కానీ నితిన్ మాత్రం చిత్రయూనిట్ కి మెహ్రిన్ కౌర్ ను ఫైనల్ చేయమని చెప్పటంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ని కాస్త పెంచేసింది. 


నాలుగు లక్షలు ఎక్కవయినా పర్వాలేదు… మెహ్రిన్ కౌర్ ను ఫైనల్ చేయమని తనదైన శైలిలో నితిన్ చెప్పినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మెహ్రిన్ కౌర్, నితిన్ కాంబినేషన్ స్క్రీన్ పై బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకే మెహ్రిన్ కౌర్ అంటే నితిన్ తెగ ఇష్టపడుతున్నారు. మొత్తంగా నితిన్ కారణంగా మెహ్రిన్ కౌర్ కి ఇండస్ట్రీలో భలే డిమాండ్ పెరిగిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: