ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ గొప్ప  అనేది ఉండదు. ప్రతి ఒక్కరు ఏదొక సందర్భంలో మరొకరి సహాయాన్ని కోరాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఓ మూవీ సక్సెస్ అనేది ఒక్క డైరెక్టర్ చేతిలోనే ఉండదు. అన్ని విభాగాలకి సంబంధించిన సమిష్టి కృషి కారణంగానే సినిమా సక్సెస్ అవుతుంది. అలాంటిది తాజాగా శ్రీనువైట్ల ఓ విషయంలో మెగాహీరోని కామెంట్ చేయటం  జరిగిందని అంటున్నారు.


దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆ మెగాహీరో…ఇప్పుడు ఈ డైరెక్టర్ కి గట్టిషాకింగ్ ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… శ్రీనువైట్ల తాజాగా మిస్టర్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్ ని చూడగా…ఇప్పుడు శ్రీనువైట్ల కి పలువురు హీరోలు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే మిస్టర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో మిస్టర్ కథని మొదట అల్లుఅర్జున్ కి చెప్పానని…తను రిజెక్ట్ చేశాడని చెప్పుకొచ్చారు.


అలాగే అల్లుఅర్జున్ కి ఈ కథ వాల్యూ తెలియదని కామెంట్ చేయటం జరిగిందని అంటున్నారు. అయితే కొంత కాలంగా శ్రీనువైట్ల సక్సెస్ లను చూడలేకపోతున్నారు.  ఆగడు, బ్రుస్ లీ సినిమాల పరాజయం తరువాత వచ్చిన మిస్టర్ సైతం పరాజయాన్ని చూసింది. అయితే మిస్టర్ మూవీ రిలీజ్ సమయంలో మరోసారి అల్లుఅర్జున్ తో కమిట్మెంట్ ని తీసుకునే ప్రయత్నం చేశాడు శ్రీనువైట్ల. కానీ అల్లు అర్జున్ మాత్రం శ్రీనువైట్ల కి మొహమాటం లేకుండా నో చెప్పాడని అంటున్నారు.


మరో మూడు సంవత్సరాల పాటు తన డేట్స్ లేవని చెప్పటంతో శ్రీనువైట్ల షాక్ అయ్యాడని అంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీనువైట్ల తిరిగి మహేష్ బాబు సినిమాని చేయటాని రెడీ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు, శ్రీనువైట్ల ని దగ్గరకి రానిస్తారో? లేదో? చూడాలి మరి. ఇప్పటికే మహేష్ బాబు మరోవైపు కొరటాల శివ, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ ల దర్శకత్వంలో చేయటానికి రెడీగా ఉన్నారు. శ్రీనువైట్ల తో సినిమా అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని కొందరు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: