కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు జరిగే అగ్రిమెంట్స్ పక్కాగా ఉండాలి. అలా అగ్రిమెంట్స్ ప్రకారమే సినిమా పూర్తవుతుంది. ఒకవేళ ఏమైనా తేడాలు వచ్చాయంటే ఆ అగ్రిమెంట్స్ ని చూపించి లీగల్ గా ముందుకు వెళతారు. ఇప్పుడు ఓ మూవీ విషయంలోనూ  ధనుష్ కి ఫిమేల్ యాక్టర్ కి కాస్త గొడవలు వచ్చాయి.


దీంతో ధనుష్ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ప్రముఖ హీరోయిన్ ధనుష్ కి“మైండ్ యువర్ వర్డ్స్” అంటూ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధమైన పొగరు సమాధానానికి ధనుష్ బాగా హర్ట్ అయ్యాడు. ధనుష్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పవర్‌పాండి లో ఈ విధంగా జరగటం అనేది మడోనా కి అస్సలు మింగుడు పడటం లేదు.


అసలు గొడవ రావటానికి కారణం వచ్చేసి… ఈ చిత్రంలో రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్ర లో నటించగా నటి మడోనా అతిథి పాత్రలో నటించారు. మడోనా కి అడిగిన పారితోషికం తో పాటు చిత్ర ప్రచారంలో పాల్గొనాలనేది అగ్రిమెంట్ అయింది. అయితే మడోనా…చిత్ర యూనిట్ కలిసి నిర్వహించిన మూవీ ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో చిత్ర టీం కామెంట్ చేసింది. దీనిపై మడోనా స్పందిస్తూ మాటలను అదుపులో పెట్టుకొవాలని ధనుష్ ని ఉద్ధేశించి మాట్లాడింది.


ఇక్కడ వరకూ అందరకూ తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటంటే… మడోనా కి పలు మూవీల్లో ఆఫర్స్ రాకుండా ధనుష్ ప్రయత్నాలు చేశాడని అంటున్నారు. అంతే కాకుండా మడోనా సైతం ఎన్నో ఆఫర్స్ ని ఈ రెండు వారాల సమయంలో కోల్పోయిందని అంటున్నారు. తనని కావాలని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇరుకున పెడుతున్నారని ఈ బ్యూటీ చెప్పుకురావటం అందరిలోనూ ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: