ఇప్పుడు ఎక్కడ విన్నా ‘క్రౌండ్ ఫండింగ్’ కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. విద్య వైద్యం సినిమా నిర్మాణం వ్యాపారం ఇలా అనేక విషయాలకు సంబంధించి ఆలోచనలు బాగుంటే సహాయం చేసే దాతలు చాలామంది ముందుకు వస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఒక విద్యార్థి ప్రాణాన్ని కాపాడటానికి ఆ విద్యార్థి ఎవరో తెలియకపోయినా ఆ విద్యార్థి కోసం ‘ ఆపదలో ఫ్రెండ్’ అంటూ జరిగిన ప్రచారానికి ‘క్రౌండ్ ఫండింగ్’ ద్వారా సుమారు 18 లక్షల రూపాయలు వసూలు కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే ఈ ప్రయత్నం వెనుక హీరో నాని నటి మంచు లక్షిల పరోక్ష ప్రోత్సాహం ఉండటం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘బావన్స్ వివేకానందా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న అమల్ ఉన్నట్టు ఉండి ఒకరోజు కాలేజీలో పడిపోయాడు దీనితో ఖంగారు పడిపోయిన అతని స్నేహితులు అతడిని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు. అయితే అతడికి లక్షల మంది ప్రజలలో ఒకరికి అరుదుగా వచ్చే అసాధారణ వ్యాది ‘ఫాన్కోని అనీమియా’ వచ్చినట్లుగా డాక్టర్లు నిర్ధారించి ఆ వ్యాధి నివారణకు 25 లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. 

దీనితో అమల్ స్నేహితుడు నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసాడు. ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నానీ మంచు లక్ష్మి ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేయడంతో అమల్ సహాయం కోసం ఇప్పటికే 18 లక్షల రూపాయలు ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా వసూలు కావడం ఒక ఆశ్చర్యం అయితే ఈ విషయం వెనుక నానీ – మంచు లక్షిల పరోక్షంగా ప్రోత్సాహం ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

సోషల్ మీడియా వల్ల యూత్ చెడి పోతోంది అన్న ప్రచారం జరుగుతూ ఉంటే అదే సోషల్ మీడియాలో ఇలాంటి మంచి పనులు జరగడం సోషల్ మీడియా స్థాయిని పెంచుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: