మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ను ప్రమోట్ చేస్తూ రానా ఇచ్చిన ఒక తుంటరి సమాధానానికి మీడియా వర్గాలు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముంబాయిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న కొంతమంది మీడియా ప్రతినిధులు మళ్ళీ రానాను ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో ఇరుకున పెట్టడానికి మళ్ళీ ప్రయత్నించారు.

ఇలాంటి ప్రశ్నలకు ఇక శాస్వితంగా చెక్ పెట్టాలని రానా ఒక తుంటరి సమాధానం ఇచ్చి అక్కడి మీడియా వర్గాల మైండ్ ను బ్లాంక్ చేసాడు. బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపెసాడని ఆ చీకట్లో తనకు ఆ దృశ్యం సరిగ్గా కనిపించనందు వల్ల తాను ఆ సీన్ ను పూర్తిగా ఫాలో కాలేకపోయానని అని కామెట్ చేసి ఏకంగా మీడియా ప్రతినిధులు మరో ప్రశ్న ఈ విషయమై అడగకుండా జాగ్రత్త పడ్డాడు రానా.  

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి2’ తో రానా దగ్గుబాటి రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్న నేపధ్యంలో ఇప్పటికే రానాకు పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ‘బాహుబలి2’ కి రిలీజ్‌కు ముందే రానా రష్యా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 
బాహుబలి2’ ప్రమోషన్ సందర్భంగా రానా ఒక జాతీయ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ హాలీవుడ్‌ తో పాటు ఇతర విదేశీ భాషా చిత్రాల్లో నటించాలని ఆఫర్లు వస్తున్న విషయాన్ని బయట పెట్టాడు. అయితే రష్యా సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాను అని సంకేతాలు ఇస్తున్నాడు రానా. 

రష్యా భాషలో యుద్ద నేపథ్యంలో నిర్మింపబడే ఈసినిమా చాల భారీ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. దీనికితోడు ఇరాన్ ఇతర భాషల విదేశీ సినిమాలలో కూడ రానాకు ఆఫర్లు వస్తున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ తరువాత రానా ఇంటర్ నేషనల్ స్టార్ గా మారిపోయే ఆస్కారం కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: