తెలుగు సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బాహుబలి2 మూవీకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న ఆధరణ అంతా ఇంతా కాదు. అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నాలుగు షోలకి…ఆరు షోలకి ఉన్న తేడా ఏమిటి? ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల చర్ఛలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్న చర్చల్లోని కొన్ని వివరాలను చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు.


బాహుబలికి 2 అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా పేరు సంపాదించుకుంది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఈ మూవీకి బంపర్ ఆఫర్ ఇచ్చాయి. బాహుబలి2 రిలీజైన తర్వాత మొదటి 10 రోజుల వరకు అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చాయి. ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే ఇప్పుడు కేవలం 6 రోజుల్లోనే కలెక్షన్స్ ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోలేకపోతే ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, థియోటర్స్ యజమానులు నష్టపోతున్నారు.


ఇప్పుడు బాహుబలి2 తెచ్చిన కొత్త ఫార్ములా 6 షోలతో మొదటగా లాభపడేది డిస్ట్రిబ్యూటర్స్. సినిమాని కొన్న ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కారణంగా గతంలో బాహుబలి మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకే 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తే…ఇప్పుడు ఆరు షోల ఫార్మెట్ తో 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. ఇక పది రోజులు కలెక్షన్స్ ని చూస్తే…ఒక్క తెలుగు రాష్ట్రాల నుండి ఈ మూవీకి 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బాలీవుడ్, తమిళ్, కన్నడ, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల కలెక్షన్స్ కలుపుకుంటే ఈజీగా మరో 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ మొదటి 10 రోజుల్లే వచ్చే అవకాశం ఉంది.


దీంతో బాహుబలి2 టార్గెట్ కలెక్షన్స్ 1000 కోట్ల రూపాయలు డ్రీమ్ నెరవేరినట్టే. ఈ 1000 కోట్ల రూపాయలకి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో కీలకంగా ఉన్నాయి. అందుకే రోజుకి 6 షోల ఫార్మెట్ ని బయటకు తీసుసువచ్చారు. ఎక్కువ మంది సినిమాని చూడటానికి అవకాశం కల్పిస్తున్నారు. దీని కారణంగా బాహుబలి2కి వచ్చే కలెక్షన్స్ సాధారణ స్థాయి మించి ఉంటుంది. మొత్తంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ కి తెలుగు రాష్ట్రల్లోని ఆరు షోల ఫార్మెట్ సరైన ప్లాన్ అనేది చిత్ర నిర్మాత మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: