దర్శకధీరడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్రేజ్ అందరిలోనూ పీక్స్ కి చేరుకుంది. ప్రతి ఒక్కరూ బాహుబలి2 మూవీని చూడాలని ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కావటంతో… బాహుబలి2 కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి2 రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది.


దీంతో బాహుబలి2 కి సంబంధించి కొన్ని సీన్స్ వివరాలు బయటకు వస్తున్నాయి. ఆ విధంగా వచ్చిన వివరాలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… బాహుబలి2మూవీలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువుగా ఉండనున్నాయి. బాహుబలి మొదటి భాగంతో పోల్చితే రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు అత్యధికంగా ఉంటాయి.


అంతే కాకుండా కథ సైతం బాహుబలి మొదటి భాగం కంటే బాహుబలి2 లోనే ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి2 మొత్తంలో రానా విగ్రహం పైనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక సన్నివేశంలో ఈ విగ్రహాన్ని ప్రభాస్ పడగొట్టేస్తాడని అంటున్నారు. అంతే కాకుండా బాహుబలి..భల్లాలదేవుని విగ్రహగ తలని నరికి ఓ పెద్ద బావిలో పడవేస్తాడనే టాక్స్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.


ఇక రానా విగ్రహ తలని బావిలో పడేసినప్పుడు…ఆ సీన్ లో తలని నీళ్ళతో ముంచేయటానికి దాదాపు 43 ట్యాంకర్ల నీరు పట్టిందని అంటున్నారు. ఒకే ఒక్క సీన్ కి, దాని పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎంతలా జాగ్రత్త తీసుకుంటాడో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక నీళ్ళల్లో మునిగిన రానా విగ్రహపు తల సన్నివేశం... సినిమాలో సూపర్భ్ గా ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: