ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి2 ఫీవర్ నడుస్తుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచం అంతటా బాహుబలి2 ఫీవర్ నడుస్తుందని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 ఈ శుక్రవారం భారీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని రాజమౌళి టీం పీక్స్ కు తీసుకువెళ్లింది.


ఎక్కడ, ఎవరు మాట్లాడుకున్నా ఒక్క బాహుబలి2 మూవీ గురించే అని అంటున్నారు. అయితే సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ కి ముందే కొన్ని ప్రివ్యూ షోలని ప్రదర్శించుకుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలకి మాత్రమే ఈ విధమైన ప్రదర్శన చేస్తుంటారు. ఆ విధంగా చూసుకుంటే బాహుబలి2 మూవీ ఇప్పటికే ప్రివ్యూ షోలను జరుపుకొని ఉండాలి కదా. దీన్నిబట్టి బాహుబలి2 ప్రివ్యూ షోలను ఇప్పటికే ఇండస్ట్రీలోని పెద్దలు చూసే ఉంటారు.


ముఖ్యంగా రాజమౌళికి గురువుగా ఉండే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాహుబలి2ని చూసి ఉండాలి. అలాగే ఇంకా ఎంతో మంది బాహుబలి2ని చూసి ఉండాలి. అయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రావటం లేదు. ఎవరు బాహుబలి2 మూవీ ప్రివ్యూ షోలను చూశారు? అనే దానిపై ఎక్కడా టాక్స్ లేవు. బాహుబలి2 ప్రివ్యూ షోలు ఇప్పటికే ప్రదర్శన చేయబడ్డాయి? అనే న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతుంది.


కానీ ఆ షోలను చూసిన ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఎవరు? అనే  దానిపై ఎవరి పేర్లు బయటకు రావటం లేదు. దీంతో బాహుబలి2 ప్రివ్యూ షోలకి సంబంధించిన సమాచారం రాజమౌళితో పాటు మరో అయిదుగురికి మాత్రమే తెలుసని అంటున్నారు. రాజమౌళితో పాటు ఉన్న మిగతా అయిదుగురు ఈ న్యూస్ ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోవటం లేదు. అసలు ప్రివ్యూ షోలు ఎప్పుడు? ఏ ల్యాబ్ లో ప్రదర్శిస్తున్నారు? అనే విషయం కూడ ఎవ్వరీ తెలియటం లేదు. దీంతో బాహుబలి2 ప్రివ్యూ షోకి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉందంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: