సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ తరహాలో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రంతో కోసం  ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో గ్రాఫిక్స్ మాయాజాలం చేసిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి 2 తో అభిమాను ముందుకు రాబోతున్నారు.  ఈ చిత్రం కోసం యావత్ భారత దేశమే కాదు ప్రపంచం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ చేసే సమయంలో చిత్రంలో నటిస్తున్న ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచారు.  

తాజాగా బాహుబలి 2 కి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు రాజమౌళి. ఇప్పటికే ప్రభాస్, రానా లకు సంబంధించి పోస్టర్లు రిలీజ్ కావడం సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరుగుతుంది. తాజాగా అందాల భామ అనుష్క కి సంబంధించి ఓ ఫోటో రిలీజ్ చేశారు.

కుంతల యువరాణి దేవసేనగా అనుష్క కొత్త పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. అనుష్క నీలిరంగు చీరలో రాజసం ఉట్టి పడేలా చాలా అందంగా కనిపించింది. బాహుబలి ది బిగినింగ్‌లో డీ గ్లామర్‌గా కనిపించిన ఈ బ్యూటీ, ఈ పార్ట్‌లో మాత్రం తన అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: