బాహుబలి2 సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమా అయింది. బాహుబలి2 మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇప్పుడు ఇండియా అంతా మాట్లాడుకుంటుంది. ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీపై పైరసీ కన్నేసింది. ఇప్పటికే నిర్మాతలతో పైరసీ టీం మాట్లాడి ఢీల్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


అయితే బాహుబలి2 మూవీ పైరసీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాతల్లో ఒకరైన శోబు చెప్పుకొచ్చారు. తాజాగా ‘బాహుబలి–ది కంక్లూజన్’ కి సంబంధించిన కొన్ని విజువల్స్ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ తో హల్ చల్ చేశాయి. దీంతో అందరూ బాహుబలి2 మూవీపై పైరసీ జరిగిందని భావించారు. దీనికి వెంటనే స్సంధించిన నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ“సినిమాను వివిధ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు.


అక్కడి సెన్సార్ బోర్డులకు సినిమాను ప్రదర్శించడం జరిగింది. అంతేగాని ఇంకెక్కడా సినిమాను ప్రదర్శించలేదు. సినిమా పైరసీ జరగలేదు” అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది చెప్పిన కాసేపటికే బాహుబలి2 మూవీకి సంబంధించిన మరికొన్ని ఇమేజ్ లు ఇంటర్నేట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తంగా బాహుబలి2 మూవీ పైరసీ అయిందా? లేదా? అనే విషయంలో ఇంకా చాలా మందిలో సందేహాలు అలాగే ఉన్నాయని అంటున్నారు.


ఇంటర్నెట్ లో కనిపిస్తున్న బాహుబలి2 విజువల్స్ కి నిర్మాత సైతం షాక్ అయ్యాడని అంటున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పైరసీ పై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు రాజమౌళి సైతం ఈ మూవీని పైరసీ చేయకుండా కలెక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా చూపించాలంటే పైరసీని ఎంకరేజ్ చేయొద్దని డైరెక్టర్ కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: