ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ స్టైల్ చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. తను ఏదైనా ట్వీట్ చేసినా,మాట్లాడినా, కామెంట్ చేసినా అది సంచలనే అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు వర్మ బాహుబలి2 మూవీపై తన కామెంట్స్ ని చేసాడు. తాజాగా రాజమౌళిని ఉద్దేశించి వర్మ ట్వీట్లు చేసిన సంగంతి తెలిసిందే. 


‘రాజమౌళి తీసిన బాహుబలి2 చిత్రాన్ని చూసిన తర్వాత దేశంలో మిగిలిన దర్శకులంతా తాము ఇంకా చాలా నేర్చుకోవాల్సిన టీవీ సీరియళ్ల దర్శకులమని అనుకుంటారని నా గట్టి నమ్మకం’ అని అన్నారు. అయితే ప్రతీ సారి వర్మ ట్వీట్లకి నెటిజెన్లు రీ-కౌంటర్లు ఇస్తారు. ఈసారి మాత్రం బాహుబలి2 పై వర్మ చేసిన కౌంటర్లకి ఎటువంటి స్పంధన రావటం లేదు.


అటు మీడియా సైతం వర్మ కామెంట్స్ ని  చాలా లైట్ తీసుకున్నారు. దీంతో బాహుబలి2 పై వర్మ కామెంట్స్ ప్రస్తుతం వర్కౌట్ కావని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాహుబలి2 మూవీని చూడాలనే మూడ్ లో ఉన్నారు. దీంతో బాహుబలి2మూవీపై ఎటువంటి నెగిటివ్, పాజిటివ్ కామెంట్స్ వచ్చినా…ప్రతి ఒక్కరూ బాహుబలి2 మూవీ టికెట్స్ గురించే ఆలోచిస్తున్నారు.


దీంతో వర్మ, తను చేసిన ట్వీట్ పై ఎక్కడ రచ్ఛ జరగటం లేదు కదా…కనీసం కవరేజ్ కూడ లేకపోవటంతో షాక్ అయ్యాడని అంటున్నారు. ఇక వర్మ కూడ బాహుబలి2 మూవీని ముంబాయ్ లో చూడనున్నారని అంటున్నారు. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రాన్ని చూసేందు వర్మ ఏర్పాట్లను చేసుకున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: