రాజమౌళి దాదాపు ఐదు సంవత్సరాలపాటు ఒక మహాయజ్ఞంలా ‘బాహుబలి’ నిర్మాణం పూర్తి చేసి కొద్ది కాలం రిలాక్స్ కాబోతున్నాడు. ఈవిషయాన్ని స్వయంగా రాజమౌళి తెలియచేసాడు. రేపు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి 2’ విడుదలై ధియేటర్లలో సందడి చేస్తూ ఉంటే రాజమౌళి మాత్రం హైదరాబాద్ లో ఉండటం లేదు. 

అంతేకాదు కనీసం ఇండియాలోనే రాజమౌళి ఎవరికీ అందుబాటులో ఉండడు. ఈరోజు రాత్రి ముంబాయిలో ‘బాహుబలి 2’ ప్రీమియర్ షో ముగిసిన వెంటనే రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి భూటాన్ వెళ్ళి అక్కడి చారిత్రాత్మక కట్టడాలను అదేవిధంగా అక్కడ ఆలయాలను చూస్తూ కొద్దిరోజులు భూటాన్ లో తాను గడపబోతున్నట్లు తెలియ చేసాడు రాజమౌళి. 

‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి కొన్ని వారాల పాటు తాను రెస్ట్ తీసుకుంటాను అని రాజమౌళి గతంలో చాల సార్లు చెప్పిన నేపధ్యం తెలిసిందే. అయితే ‘బాహుబలి 2’ విడుదల రోజు నుంచే రాజమౌళి ఈదేశంలో ఉండకుండా భూటాన్ వెళ్ళడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

ఎప్పటి నుంచో తాను భూటాన్ గురించి విన్నానని ఆసియాలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన దేశం భూటాన్ ను చూడాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉంది అని చెపుతూ తన భూటాన్ టూర్ ముగిసాక కూడ మరో రెండు నెలలు ఏ ఆలోచనలు పెట్టుకోకుండా తా కుటుంబంతో హాయిగా హాలిడే ఎంజాయ్ చేస్తాను అని చెపుతున్నాడు రాజమౌళి. అంతేకాదు తన తరువాత సినిమా కథ విషయంలో తనకు ఎలాంటి టెన్షన్ లేదని తన తండ్రి చాలా కథలు ఉన్నాయి అని చెపుతూ ఆ కథలలో తనకు నచ్చిన కథను ఎంచుకుంటాను అని చెపుతున్నాడు రాజమౌళి. 

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించబోయే సినిమా ఎటువంటి గ్రాఫిక్స్ భారీ బడ్జెట్ లేకుండా ఒక వెరైటీ కథతో హీరో నానీతో వచ్చే సంవత్సరం రాజమౌళి తదుపరి సినిమా ఉంటుంది అన్న వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఈ మధ్యన జూనియర్ రాజమౌళిని కలిసి వచ్చే సంవత్సరం నుండి తమ ఇద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఈవార్తలలో ఏది నిజమో తెలియకపోయినా ప్రస్తుతానికి మాత్రం ‘బాహుబలి’ లాంటి ప్రాజెక్ట్ ను పూర్తిచేసిన రాజమౌళి దాని ఫలితం గురించి ఎదురు చూడుండా గీత సారాంశం ఒంటట్టిన ఒక వేదాంతిలా కొన్ని వారాలపాటు భూటాన్ లో రాజమౌళి గడపబోతున్నాడనుకోవాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: