తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నైజాం మార్కెట్ అనేది గుండెకాయ వంటిది. అందుకే ప్రతి మూవీకి నైజాం కలెక్షన్స్ ఎంతో అవసరం అంటారు. అటువంటిది భారీ బడ్జెట్ తో వచ్చిన బాహుబలి2 మూవీ నైజాంలో ఏ విధంగా ప్రధర్శన  జరుపుకుంటుందో ఓ సారి లుక్కేద్దాం. దాదాపు 9000 థియోటర్స్ తో ప్రపంచం అంతటా రిలీజ్ అయిన చిత్రం బాహుబలి2.

ఇక్క ఇండియాలోనే ఈ మూవీ 6500 స్క్రీన్లలో విడుదలయింది. నైజాంగ్ లో ఈ మూవీ అత్యధిక థియోటర్స్ లో రిలీజ్ అయింది. అయితే హైదరాబాద్ లో బాహుబలి2 మూవీకి మొదటి రోజు టికెట్స్ సినీ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని వస్తే….ఒక్క థియోటర్ లోనూ ప్రేక్షకులు కౌంటర్ కి వెళ్ళి టికెట్స్ తీసుకునే అవకాశం లేదు.

అన్ని టికెట్స్ బ్లాక్ మార్కెట్ లో ఓపెన్ గా దర్శనమిస్తున్నాయి. థియోటర్ గేటు ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించటంలో ప్రేక్షకులు నిరుత్సాహ పడుతున్నారు. అయితే ఈ నిరుత్సాహన్ని చూసిన బ్లాక్ మార్కెట్ టికెట్ విక్రయదారులు…వెంటనే వారి వద్దకు వాలిపోతున్నారు. 10 టికెట్ 500 రూపాయలకి, 60 రూపాయల టికెట్ 1000 రూపాయలకి, ఫస్ట్ క్లాస్ టికెట్ 1500 నుండి 2500 వరకూ అమ్ముతున్నారు.

బ్లాక్ టికెట్స్ కి ఇంత రేటు ఉన్నప్పటికీ…ప్రేక్షకులు ఏ మాత్రం వెనకాడకుండా టికెట్స్ ని కొంటున్నారు. మొదటి షో నుండి థియోటర్స్ ముందు ఇదే తంతు నడుస్తుంది. సాధారణ ప్రేక్షకులు బ్లాక్ మార్కెట్ ని చూసి యాజమాన్యంని ప్రశ్నిస్తున్నప్పటికీ…దానికి సంబంధించిన వారు అక్కడ ఎవ్వరూ లేరని సిబ్బంది చెప్పటం విశేషం. మొత్తంగా బాహుబలి2 మూవీ మొదటి రోజు షోలు అన్నీ ఒకవైపు హౌస్ ఫుల్ బోర్లులతోనూ మరోవైపు బ్లాక్ టికెట్స్ జోరుతో కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: