బాహుబలి2 మూవీ రిలీజ్ కావటంతో టికెట్స్ కోసం సినీ ప్రేక్షకులు చూపించే తెగువ అంతా ఇంతా కాదు. మొదటి రోజు టికెట్స్ కి అన్నీ అడ్వాన్స్డ్ బుకింగ్ లు జరిగిపోయాయి అంటూ అన్ని థియోటర్స్ వద్ద కనిపిస్తున్న తంతు. అయితే కొన్ని థియోటర్స్ మాత్రం 90 శాతం టికెట్స్ ను అడ్వాన్స్డ్ బుకింగ్ కి ఇచ్చేసి 10 శాతం టికెట్స్ మాత్రం నేరుగా లైన్ లో వచ్చే వారికి అవకాశం కల్పిస్తున్నారు.


దీంతో లైన్ లో వచ్చేసి ఆ టికెట్స్ ని సొంతం చేసుకోవటానికి సినీ ప్రేక్షకులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. టికెట్ కౌంటర్ ఓపెన్ అయిన అయిదే అయిదు నిముషాల్లో టికెట్స్ క్లోజ్ అవుతున్నాయి. దీని కోసం దాదాపు నాలుగు గంటల నుండి ఆ లైన్ లో నిల్చొని ప్రేక్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.


ఇదిలా ఉంటే తూర్పు గోదావరి లోని ఓ థియోటర్ లో ప్రేక్షకులు మధ్య గొడవలు జరిగాయి. టికెట్ కౌంటర్ ఓపెన్ అయిన వెంటనే లైన్ లో వెనక భాగాన ఉన్న కొంత మంది….మెరుపు వేగంతో ముందుకు దూసుకురావటం చేశారు. దీంతో కౌంటర్ కి ముందు ఉన్న వారు, వారి దూకుడికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రి ప్లాన్ తో ముందుకు వస్తున్న వారు…వారి చేతిలోని కర్రలతో దాడికి పాల్పడ్డారు.


ఇది కాస్త పెద్దదిగా మారి గ్రూపు గొడవలకి దారితీసింది. దాంతో అక్కడ జరిగిన గొడవలకి టికెట్ కౌంటర్ పూర్తిగా ద్వంసం అయిందని అంటున్నారు. పది నిముషాల్లో పోలీసులు వచ్చేసరికి ఆ అల్లరి మూక అక్కడ నుండి పారిపోయింది. నలుగురికి దెబ్బలు కావటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: