ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన‌ మూవీ బాహుబలి2. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ మూవీ హిట్ అవుతుందా? లేదా ఫ్లాప్ అవుతుందా? అనే టాక్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. కానీ  మొదటిసారిగా బాహుబలి2 మూవీ ఆ ట్రెండ్ ని పక్కన పెట్టి…కొత్త ట్రెండ్ కి తెరలేపింది.


ఇప్పుడు ఇండియా అంతటా బాహుబలి2 మూవీ సాధించే కలెక్షన్స్ ఎంత? అని మాట్లాడుకుంటున్నారు. బాహుబలి2 మూవీ పక్కా హిట్ అవుతుందనేది అందరి ఫీలింగ్. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ పై అంతటా టాక్స్ ఉన్నాయి. బాహుబలి మొదటి భాగం దాదాపు 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.


ఇప్పుడు బాహుబలి2 కచ్ఛితంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అంటున్నారు. అయితే 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టడానికి బలమైన కారణం ఒక్కటే. ఈ మూవీ అత్యధిక థియోటర్స్ లో రిలీజ్ కావటమే . బాహుబలి2 మూవీ దాదాపు 9000 థియోటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంత భారీ సంఖ్యలో రిలీజ్ అవుతుంది కాబట్టి…ఈ మూవీకి 1000 కోట్ల కలెక్షన్స్ అనేది చాలా తేలిక అని అంటున్నారు.


అలాగే తెలుగు రాష్ట్రాల్లో అధిక షోలకి పర్మిషన్ దొరకటం సైతం బాహుబలి2 కలెక్షన్స్ ఫై ప్రభావితం చూపే అవకాశం ఉందని అంటున్నారు. బాహుబలి2 టార్గెట్ అయిన 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేది సరిగ్గా వారం రోజుల్లోనే కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఇక పది రోజుల కలెక్షన్స్ వచ్చే 1000 కోట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడ ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: