ఈరోజు విడుదలైన ‘బాహుబలి 2’ లో వివిధ పాత్రలలో నటించిన నటీనటుల నటనా ప్రతిభ పై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. అయితే ఈమూవీ ఎంతో అద్భుతంగా ఉంది అని చెపుతున్న సినీ అభిమానులు ఈసినిమాలో తమన్నా పాత్ర అవంతికకు జరిగిన అన్యాయం పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

‘బాహుబలి’ వన్ లో అవంతిక పాత్రలో నటించిన తమన్నాకు మంచి పేరు రావడమే కాకుండా ఆమె గ్లామర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీనికితోడు పార్ట్ వన్ లో ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ ను చూసి తట్టుకోలేక ‘రేప్ ఆఫ్ అవంతిక’ అంటూ పెద్దపెద్ద వ్యాసాలూ కూడా వచ్చాయి. 

అయితే అంత ప్రాధాన్యత పొందిన అవంతిక ‘బాహుబలి 2’ లో అస‌లు ఈ సినిమాలో త‌మ‌న్నా ఉందా ? లేదా అనే అనుమానాలు రేకెత్తించేలా ఆమె పాత్ర సాగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీలో చివ‌ర్లో ఎక్క‌డో రెండు మూడు ఫ్రేముల్లో త‌మ‌న్నా కనిపించింది కానీ ఎక్కడా ఆమెకు చెప్పుకోతగ్గ డైలాగ్ కూడ ఇవ్వలేదు రాజమౌళి. 

‘బాహుబలి 2’ లో తమన్నా పాత్ర చాల చిన్నది అన్న సంకేతాలు రాజమౌళి ఇప్పటికే ఇచ్చినా ఇంత మరీ చిన్న పాత్రగా అవంతిక పాత్రను ముగిస్తారు అని ఎవరు అనుకోలేదు. దీనికితోడు పార్ట్ 1లో త‌మ‌న్నా పాత్ర‌కి వచ్చిన స్పందనను చూసి ‘బాహుబలి 2’లో అవంతిక పాత్ర నిడివి పెంచార‌ని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలు ఏమి నిజం కాలేదు. అందుకే కాబోలు ‘బాహుబలి 2’ ప్రమోషన్ లో తమన్నాను అప్పుడప్పుడు మాత్రమే రాజమౌళి మీడియా ముందుకు తీసుకు వస్తున్నాడు. దీనితో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక బాధ పడుతున్న తమన్నాకు ‘బాహుబలి 2’ ఎంత చరిత్ర సృష్టించినా తమన్నాకు కెరియర్ పరంగా పెద్దగా ఏది కలిసి రాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: