తెలుగు,తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతిక.  చంద్రముఖి చిత్రంలో గంగ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పింది.  తమిళంలో ఎక్కువ సినిమాలు తీసిన జ్యోతిక హీరో సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  వీరికి ఇద్దరు పిల్లలు..అయితే వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. గ్లామర్ పరంగా ఇప్పటికే చాలా అందంగా కనిపించే జ్యోతిక రీ ఎంట్రీ కోసం చాలా మంది దర్శక,నిర్మాతలు ప్రయత్నించారు.  

Image result for vijay & jyothika

అయితే ఆ మద్య ఆ మధ్య తమిళ ఖుషీ కాంబినేషన్ దాదాపు దశాబ్దంన్నర తర్వాత రిపీట్ కానున్నట్టుగా వార్తలు వచ్చాయి. విజయ్, జ్యోతిక కాంబో రిపీట్ కానుందని, అట్లీ దర్శకత్వంలో రూపొందే సినిమాతో ఇది జరగనుందని సమాచారం అందింది.  కాకపోతే ఆ సినిమా నుంచి జ్యోతిక తప్పుకున్నట్లు కోలీవుడ్ లో టాక్.  

Image result for vijay & jyothika

అయితే దీనికి కారణం హీరో సూర్య అయి ఉంటారని అంటున్నారు. విజయ్ సరసన జ్యోతిక నటించడం ఇష్టం లేని సూర్య ఆ సినిమా నుంచి తప్పుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే అవి అబద్ధం అని, తనకే అట్లీతో విబేధాలు వచ్చి సినిమా నుంచి తప్పుకున్నట్టుగా ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: