సూపర్ స్టార్ మహేష్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచేసిన ఈ సినిమా అసలైతే జూన్ 23న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగష్టుకి పోస్ట్ పోన్ అవుతుందని టాక్. ఈ విషయం చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయకపోయినా సరే అంతా ఫిక్స్ అయిపోయారు.  


స్పైడర్ వాయిదాకు ముఖ్య కారణం క్లైమాక్స్ షూట్ పూర్తవలేదని అంటున్నారు. అయితే సినిమా మొదటి షెడ్యూల్ లోనే క్లైమాక్స్ షూట్ చేశాడట మురుగదాస్. కాని సినిమా మొత్తం అయ్యాక చూస్తే క్లైమాక్స్ కాస్త వీక్ అయినట్టు కనిపించగా మళ్లీ దాన్ని రీషూట్ చేస్తున్నారట. మే నెలలో ఈ షూట్ పెట్టనున్నారట. 


ఇక ఈమధ్యనే సినిమాలోని మహేష్ స్టిల్ సినిమా మీద మరింత అంచనాలను పెంచేశాయి. తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ టార్గెట్ తో వస్తుంది. సినిమాలో మహేష్ స్పి ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 


ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఇయర్ రాబోతున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: