టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ తో మన హీరోలు డేటింగ్ చేస్తారా? అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు…ట్రెండ్ ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పాలి. ఆ విధంగాంనే తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ తో మాస్ రాజా రవితేజా డేటింగ్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాల్ని ప్లాన్ చేశారు.

ఈ చిత్రాలకి సంబంధించిన పనులు శరవేగంగా ముందుకు వెళుతున్నాయి. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ‘రాజా ది గ్రేట్’ ఇప్పటికే జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రారంభోత్సవం దగ్గర నుండి ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవటంతో ఇది మరో మూడు నెలల్లో రిలీజ్ కానుందని అంటున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో రవి తేజ సరసన మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రవితేజ ఎనర్జీకి ఈ బ్యూటీ తెగ ఫిదా అవుతుంది. మెహ్రీన్ కౌర్ ప్రిజాద కి రవితేజ బాడీ లాంగ్వేజ్ అంటే తెగ ఇష్టం అంట. షూటింగ్ లో ఏ మాత్రం కాస్త గ్యాప్ దొరికిగా రవితేజతో టైంపాస్ చేస్తుందని అంటున్నారు. అలాగే మెహ్రీన్ కౌర్ ప్రిజాద కి సైతం కొన్ని ఆఫర్స్ రావటం వెనుక‌  రవితేజ తనవంతుగా సహాయం చేస్తున్నాడని అంటున్నారు.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం మెహ్రీన్ కౌర్ ప్రిజాద తో రవితేజ డేటింగ్ లో ఉన్నాడని అంటున్నారు. రవితేజని తెగ ఇష్టపడుతున్న మెహ్రీన్ కౌర్ ప్రిజాద ను వదిలించుకోవటం రవితేజ కి సాధ్యం కావటం లేదనేది ఇండస్ట్రీ టాక్స్. గతంలో ఈ బ్యూటీ నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించింది. అప్పటి నుండి ఇండస్ట్రీ.. మెహ్రీన్ కౌర్ ప్రిజాద ని ఓ కంటే కనిపెడుతూనే ఉంది. ఇక తాజాగా మెహ్రీన్ కౌర్ ప్రిజాద, రవితేజ్ పై పొగడ్తలను కురిపించింది. తను ‘రాజా ది గ్రేట్’ సినిమాలో వర్క్ చేయటం…అలాగే స్టార్ హీరో రవితేజతో వర్క్ చేయడం నిజంగా తన అదృష్టం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: