చరిత్ర సృష్టిస్తున్న ‘బాహుబలి 2’ కలక్షన్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ క్రిటిక్స్ కు కూడ అర్ధంకాని విషయంగా మారిన నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి 2’ గురించి చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఈసినిమా మహా అద్భుతం అంటూ పొగడ్తలు కురిపిస్తూ ఉంటే మరికొందరు ఈసినిమాను టార్గెట్ చేస్తూ చాల తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న నేపధ్యం తెలిసిందే.

అయితే ఈసినిమా ఎవరి ఊహలకు అందని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల అభిమానుల మధ్య మళ్ళీ చిచ్చు రేపడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ‘చెప్పను బ్రదర్’ కామెంట్ తో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ బన్నీ చేసిన తరువాత అవకాసం దొరికినప్పుడు ప్రతిసారి పవన్ అభిమానులు అనేక విధాలుగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇలాంటి పరిస్థుతులలో కొద్ది రోజుల క్రితం ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ ముందు వచ్చే భల్లాలదేవ పట్టాభిషేకం సీన్ ను చిత్రీకరించడానికి ప్రేరణ పవన్ అభిమానులు ఒక ఆడియో ఫంక్షన్ లో చేసిన పవన్ నామస్మరణ అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఆ కామెంట్స్ విపరీతంగా పవన్ అభిమానులకు నచ్చడంతో విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ కు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

అల్లు అర్జున్ కు భల్లాలదేవ గెటప్ ఇచ్చి ఒక పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పవన్ అభిమానులు చేసే నామస్మరణ వినలేక పోతు అసహనానికి గురి అవుతున్న బన్నీ ఫీలింగ్స్ ను భల్లాల దేవగా మార్చు ఒక కొత్త హడవిడిని సోషల్ మీడుయాలో చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఆ పోస్టర్ వైరల్ గా మారిందని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈ హడావిడి మళ్ళీ పవన్ బన్నీల అభిమానుల మధ్య మరొకసారి చిచ్చు రగిల్చి త్వరలో రాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ టాక్ పై ప్రభావాన్ని చూపెడతాయా  అన్న అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: