తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించిన గొప్ప నటులు కోటా శ్రీనివాసరావు.  విలన్, కామెడీ, క్యారెక్టర్ పాత్రలు ఏవైనా సరే తనదైన స్టైల్లో మెప్పించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  ప్రస్తుతం తాత పాత్రల్లో కనిపిస్తున్న కోటా గతంలో తాను మంచి ఫామ్ లో ఉండగా కొంత మంది కక్ష కట్టి మరీ తనకు చాన్సులు రాకుండా చూశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.   గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో విలన్లు కరువైనట్లు ఇతర భాషల్లో నటించే విలన్లను తీసుకు వస్తున్నారని..ఇక్కడి వారికి చాన్సులు లేకుండా చేస్తున్నారని అన్నారు.
Image result for chiranjeevi
గతంలో  ఎక్కడెక్కడి నుండి విలన్ల ని ఇక్కడికి తెచ్చుకున్నారు కానీ కోట శ్రీనివాసరావు ని మాత్రం అంతగా ఎంకరేజ్ చేయలేదు . అయితే అలా కోట శ్రీనివాసరావు తోక్కేసిన వాళ్లలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే దర్శకులు దాసరి నారాయణరావు , మెగాస్టార్ చిరంజీవి .  ఆ మద్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సమస్యపై కోటా శ్రీనివాసరావు దీక్షకు దిగారు..అయితే ఆయన దీక్షకు దిగడం చిరంజీవికి, దాసరికి ఎంత మాత్రం నచ్చలేదట.
Image result for dasari narayana rao
 దీక్ష విరమించమని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని దాసరి చెప్పినా కోట మొండిఘటం కావడంతో కుదరలేదు అయితే చిరంజీవి వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించాలని కోరాడట దానికి కోట అంగీకరించలేదు.  దాంతో టు దాసరి ఇటు చిరు కోట ని టార్గెట్ చేసారు కట్ చేస్తే వాళ్ళ సినిమాలలో కోట శ్రీనివాసరావు కు సినిమాలు లేకుండా చేసారు. ఇది గతం కాగా ఇప్పుడు ఆ విషయాన్నీ  చెప్పి తన మనసులో భారం దించుకున్నారు కోట. 



మరింత సమాచారం తెలుసుకోండి: