స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఇండియా మోషన్ పిక్ఛర్ ‘బాహుబలి-2’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఓ రేంజ్ లో విజృంభిస్తున్నాయి. ‘బాహుబలి-2’ సాధించిన విజయం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు కలెక్షన్స్ కంటే హిందీ వెర్షన్ సాదిస్తున్న కలెక్షన్లు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని నిద్రపోనివ్వటం లేదు.


బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలకి సాధ్యం కాని కలెక్షన్స్ ‘బాహుబలి-2’ కొల్లగొడుతుంది. ఇండియాలో‘బాహుబలి-2’ సాధించిన గ్రాస్ లో 40 శాతం హిందీ భాషలోనే కావడం ఇక్కడ విశేషం. ఇక ‘బాహుబలి-2’ వంటి సినిమాకి అయిన ఖర్చు కేవలం ఒకే ఒక్క  రోజులో వచ్చిన కలెక్షన్స్ కి సరిపోయాయి.


ఇక ఇప్పటి వరూ ‘బాహుబలి-2’ మూవీకి వచ్చిన కలెక్షన్స్ వివరాలకి సంబంధించిన కొన్ని కీలక సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ‘బాహుబలి-2’ మూవీ మొదటి మూడు రోజుల్లోనే 514 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. మరి ఇప్పుడు ఆరు రోజుల కలెక్షన్స్ వివరాలను చూస్తే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 768 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇంకా థియోటర్స్ వద్ద బాహుబలి2 సందడి కొనసాగుతుంది. మొదటి రెండు వారాల కలెక్షన్స్ ని ఊహాజనితంగా లెక్కిస్తే...915 కోట్ల రూపాయల వరకూ ఇది వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.


అయితే ‘బాహుబలి-2’ మూవీకి సంబంధించిన పైరసీ మొదటి రోజు సాయంత్రానికే మార్కెట్ లోకి రావటంతో ఈ మూవీ కలెక్షన్స్ పై ఇది బాగా ప్రభావితం చూపించిందని చెప్పవచ్చు. ‘బాహుబలి-2’ పైరసీ ఆడియో, వీడియో మంచి క్వాలిటితో వచ్చిందని అంతటా ప్రచారం జరుగుతుంది. మొదటి వారం రోజులు పైరసీని కంట్రోల్ చేస్తే... ‘బాహుబలి-2’ మొదటి 6 రోజుల్లోనే 800 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: