ఇంత కాలం బాలీవుడ్ నుండి ఎంతో నేర్చుకోవాలి అని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ భావించింది. ముఖ్యంగా టాలీవుడ్ దీన్ని పాటిస్తుంది. కానీ ఇప్పడు `బాహుబ‌లి-2` వచ్చిన తరువాత ఇది పూర్తి రివర్స్ గా మారింది. ఇప్పుడు బాలీవుడ్…`బాహుబ‌లి-2`ని చూసి ఎంతో నేర్చుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీని గమనిస్తుంది. ఓ రీజనల్ ఫిల్మ్ అయిన `బాహుబ‌లి-2`…ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్స్ ని చూస్తుంటే బాలీవుడ్ మేకర్స్ అంతా ముక్కున వేలుసుకుంటున్నారు.


పెద్ద హీరోలకి నోటి మాట రావటం లేదు. మొత్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీ `బాహుబ‌లి-2` ముందు తల వంచుకొని కూర్చుంది. ఇదంతా రాజమౌళి తెరకెక్కించిన `బాహుబ‌లి-2` విజయంతో టాలీవుడ్ కి వచ్చిన ఘనత. ఇదిలా ఉంటే `బాహుబ‌లి-2` విజయం తరువాత బాలీవుడ్ మార్కెట్ లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. గతంలో బాలీవుడ్ సినిమాలకి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అత్యధికం. కొన్ని సందర్భాల్లో 150 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి.  


అయితే ఈ మూవీలు సాధించే కలెక్షన్స్ 300 నుండి 500 కోట్ల రూపాయల మధ్య లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 700 కోట్ల రూపాయల వరకూ చేరుకుంటాయి. కానీ `బాహుబ‌లి-2` వంటి ఓ రీజనల్ ఫిల్మ్ ఇప్పుడు 1000 కోట్ల రూపాయలను టచ్ చేస్తుంటే…బాలీవుడ్ మేకర్స్ ని నిద్రపట్టడం లేదు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలకి సంబంధించిన బడ్జెట్ ని అమాంతంగా పెంచేస్తున్నారు. ఇండియన్ సినిమాకి 1000 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది అనే విషయం `బాహుబ‌లి-2` తో తెలుస్తుంది. దీని కారణంగా ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాల బడ్జెట్ భారీగా పెరుగుతుంది. `బాహుబ‌లి` ముందు ఒక లెక్క…`బాహుబ‌లి` తరువాత ఒక లెక్క అంటూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మేకర్స్ స్వయంగా నిర్మాతలతో అంటున్నారు. 


`బాహుబ‌లి-2` పేరు చెప్పి నిర్మాతలతో భారీగా ఖర్చు పెట్టించేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న `ప‌ద్మావ‌తి` బ‌డ్జెట్ ఒక్కసారిగా పెరిగింది. ఈ సినిమాని భ‌న్సాలీ 160 కోట్ల రూపాయలతో తెర‌కెక్కించాలి. కానీ, కానీ `బాహుబ‌లి-2` సక్సెస్ ని చూసిన తరువాత బ‌డ్జెట్ ని పెంచాల్సిందేన‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో 160కోట్ల నుంచి 200 కోట్ల‌రూపాయలకు బ‌డ్జెట్ పెరిగింది. అలాగే సల్మాన్,షారుఖ్, అమీర్ ఖాన్ వంటి హీరోల మూవీలకి ఇప్పుడు బడ్జెట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: