తెలుగు ఇండస్ట్రీలో ‘అష్టా చమ్మ’చిత్రంతో పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్ తర్వాత నటుడిగానే కాకుండా ‘ఊహలు గుస గుసలాడే’,‘జ్యో అచ్యూతానంద’సినిమాలతో డైరెక్టర్ గా మారారు.  మంచి కుటుంబ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.  ఇక నటుడిగా పలు సినిమాల్లో నటిస్తున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా ‘బాబు బాగా బిజీ’ చిత్రంతో ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ తో వచ్చిన ‘హంటర్’చిత్రం రిమేక్ గా రూపొందిన ‘బాబు బాగా బిజీ’ మొదటి నుంచి కాంట్రవర్సీ అవుతూ వచ్చింది.  
Related image
అంతే కాదు ప్రస్తుతం బాహుబలి సృష్టిస్తున్న రికార్డులకు చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా భయపడిపోయి సినిమాను రిలీజ్ చేసే ఆలోచన మార్చుకున్నారు. కానీ శ్రీనివాస్ అవసరాల మాత్రం బాహుబలి కి పోటీగా బాబు బాగా బిజీ అనే అడల్ట్ కాంటెంట్ సినిమాతో వచ్చాడు. శ్రీనివాస్ అవసరాల, తేజస్వి , మిష్టి, సుప్రియ ప్రధాన పాత్రలో తెరక్కేక్కిన ఈ చిత్రానికి నవీన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు.  ఇండస్ట్రీకి కొత్త కావడంతో సినిమా ప్రెజెంటేషన్ సరిగా చేయలేక పోయాడన్న టాక్ వస్తుంది.  
Image result for babu baga busy hot pics
అనవసరమైన సీన్స్ తో కొంత బోర్ కొట్టించడం వంటి అంశాలు పెద్ద మైనస్ అయినట్లు ఆడియన్స్ అంటున్నారు. తేజస్వి ,మిష్టి వంటి హీరోయిన్ల అందాల కోసం వచ్చిన ప్రేక్షకుడికి కొంత నిరాశే ఎదురవుతుంది. కథకు అవసరమైన విధంగా సీన్స్ చూపించడంలో బాబు బాగా బిజీ చిత్ర యినిట్ విఫలమయ్యింది. దీంతో సినిమా ఎంత వరకు బాహుబలిని ఎదుర్కొని నిలుస్తుందో చూడాలి. రేపటి వరకు ఈ సినిమా ఎలా ఉండబోతుందీ...సినిమా హిట్టా..ఫట్టా అనేది తెలియబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: