నందమూరి హీరోలులాగే నందమూరి అభిమానులకు కూడ చాల ఆవేశం. ఇటువంటి ఆవేశం వల్ల ఒకొక్కసారి నందమూరి అభిమానులు సంచలన వార్తలకు చిరునామాగా మారుతున్నారు. లేటెస్ట్ గా 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఒక  విషయంలో టార్గెట్ చేస్తూ జూనియర్ అభిమానులు చేసిన రగడ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘ఐఫా’ అవార్డ్ ఫంక్షన్ లో తాను దర్శకత్వం వహించిన ‘పెళ్ళి చూపులు’ సినిమాకు అవార్డ్ రాకపోవడం పై తరుణ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపధ్యం తెలిసిందే. అయితే ఆతరువాత ‘పెళ్లిచూపులు’ సినిమాకు రెండు జాతీయ అవార్డ్ లు వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఈమధ్య ఒక టివి ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఈ విషయమై కామెంట్ చేస్తూ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘ఐఫా’ అవార్డుల విషయమై తనకు ఆ అవార్డ్ ఫంక్షన్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారని తన లాంటి కొత్త దర్శకులకు అవార్డులిస్తే, జనాలు చూడరని, టీఆర్పీలు రావని, కాబట్టి ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలకు అవార్డు ఇస్తే అన్ని రకాలుగా వర్కవుట్ అవుతుందని తనకు వివరణ ఇచ్చినట్లు చెప్పి మరొక వివాదంలో చిక్కుకున్నాడు తరుణ్ భాస్కర్. 

ఈ కామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టికి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్‌ను టార్గెట్‌ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసారు. అంతేకాదు ఒక్క సినిమా హిట్ అయితే ఇంత పొగరా తమ ఎన్టీఆర్ ను కామెంట్స్ చేసే స్థాయికి ఎదిగిపోయావా అంటూ ఘాటైన కామెంట్స్ తో జూనియర్ అభిమానులు తరుణ్ భాస్కర్ పై ఎదురుదాడి చేసారు. 

దీనితో షాక్ అయిన తరుణ్ భాస్కర్ జరుగుతున్న వివాదాన్ని గ్రహించి ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెపుతూ తన ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టడంతో ఈ వివాదం ముగిసినట్లు తెలుస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: