దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఒక మహిళ ఈ గ్లామర్ ప్రపంచంలో యాంకర్ గా కొనసాగడం అత్యంత అసాధ్యమైన పని. అయితే సుమ తనకు ఉన్న మంచి సమయస్పూర్తితో బుల్లితెర రంగంలో ‘మహారాణి’ గా వెలుగొందుతోంది. 

ఆమె వ్యాఖ్యానం చేసే ఫంక్షన్స్ లో ఆమె వేసే పంచ్ లు సెటైర్లు ఆమెను ఇప్పటికీ టాప్ యాంకర్ గా కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే ఆమె ఫంక్షన్స్ లో వేసే సెటైర్లు ఎప్పుడూ హద్దులు దాటినట్లు కనిపించిన సందర్భాలు లేవు.

కానీ మొదటిసారిగా సుమ తను వేసే సెటైర్లలో హద్దులు దాటిన సందర్భం ఒకటి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. ఈరోజు విడుదలైన ‘బాబు బాగా బిజీ’ టీం అంతా సుమ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మిస్తీ చక్రవర్తితో సుమ మాట్లాడుతూ 'నీ పేరు ముష్టినా' అని అడిగిందట. ఈ దెబ్బతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారని టాక్.

అయితే హీరోయిన్ మిస్తీ చక్రవర్తికి మొదట్లో సుమ అన్న మాటలు అర్ధం కాకపోయినా ఆ తరువాత సుమ అన్న మాటలకు అర్ధం బెగ్గింగ్ అని తెలియగానే హీరోయిన్ మిస్తీ చక్రవర్తి బాధ పడినట్లు టాక్.అయితే చేసిన పొరపాటును గ్రహించిన సుమ తన పొరపాటును సరిద్ధిద్దుకుని ఈ హీరోయిన్ కు సారీ చెప్పినట్లు టాక్. సామాన్యంగా వివాదాలకు చాల దూరంగా ఉండే సుమ మాటలలో పొరపాట్లు రావడం ఆశ్చయాన్ని కలిగించింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: