తెలుగు ఇండస్ట్రీలోకి ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరో నానితో సమానంగా ఎంట్రీ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఆ సినిమాలో మనోడి కామెడీ చూసి అందరూ తెగ ఎంజాయ్ చేశారు.  తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న అవసరాల ఒక్కసారే దర్శకుడిగా మారి ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు.  దీంతో నటుడిగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన అవసరాల తర్వాత ‘జ్యో అచ్యుతానంద’సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు.  
Image result for babu baga busy hor
ఇక నటుడిగా కొనసాగుతున్న మనోడి ఓ వినూత్న ప్రయోగం చేయాలనే ఆలోచన మదిలో రావడం ఆలస్యం వెంటనే అమలు చేశాడు. ఇంతకీ ఆ ఆలోచన ఏంటా అనుకుంటున్నారా..బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ తో వచ్చిన సినిమా ‘హంటర్’ తెలుగులో రిమేక్ గా ‘బాబు బాగా బిజీ’గా తెరకెక్కించారు.  కొత్త దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమా దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అడల్డ్ కాంటెంట్ ఉన్న చిత్రాలు చాలా తక్కువ..అలాంటిది ఫ్యామిలీ దర్శకుడిగా,నటుడిగా ఉన్న అవసరాల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటీ అని చాలా మంది విమర్శించారు.
Image result for babu baga busy hor
కానీ మనోడు సెక్స్ పై చిత్ర విచిత్రమైన కామెంట్లు చేస్తూ సినిమా నిన్న రిలీజ్ చేశాడు. దీంతో అవసరాల శ్రీనివాస్ కు మంచి ఇమేజ్ ఉంది అయితే దాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. దర్శకుడిగా విభిన్న కథా చిత్రాలను అందించిన అవసరాల తాజాగా చేసిన బాబు బాగా బిజీ ప్రయోగం బెడిసి కొట్టింది . హంటర్ సినిమాలో ఏదో తెలియని సందేశం ఉంది అని ఎంతో నమ్మకంతో చేసాడు కట్ చేస్తే ఈరోజు రిలీజ్ అయిన బాబు బాగా బిజీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది . సినిమా పొతే పోయింది కానీ అవసరాల కున్న క్లీన్ ఇమేజ్ కూడా గంగలో కలిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: