రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి–ది కంక్లూజన్’ కు ప్రపంచం అంతటా కలెక్షన్స్ దుమ్ములేచిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రేక్షకులు బాహుబలి2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో అధిరిపోయో కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ 100 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేయనుంది.


ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటి వరకూ ఎంత వచ్చాయి? అనేదానిపై కొన్ని లెక్కలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాహుబలి2 మూవీ టార్గెట్ 1000కోట్ల రూపాయలు కలెక్షన్స్. ఇలా జరిగితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బడా హీరోలు సైతం బాహుబలి2కి సలాం కొట్టాల్సిందే.


ఈ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే బాలీవుడ్ హీరోలకి ఇప్పట్లో జరిగే పని కాదు. దీంతో ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మరో సౌత్ ఇండియన్ సినిమా రావాల్సిందే. ఇదిలా ఉంటే బాహుబలి2 ఇప్పటి వరకూ సాధించిన 8 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 7 రోజులకే 845 కోట్ల రూపాయలు వసూల్ చేసిన ఈ చిత్రం…8వ రోజు నాటికి ఇది887 కోట్ల రూపాయలకి చేరుకుంది. ఇక 9,10 రోజులు వీకెండ్ రావటంతో ఈ సినిమా 10 రోజులు పూర్తి చేసుకునే సరిసరికి 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని టచ్ చేస్తుందని అంటున్నారు.


ఇక 11వ రోజు కలెక్షన్స్ తో బాహుబలి2 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇంత ఫాస్ట్ గా ఈ తరహా రికార్డ్ ని క్రియోట్ చేయటం అనేది ఎవరి తరం కాదని అంటున్నారు. మొత్తంగా ఈ వీకెండ్ లో బాహుబలి2 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించి అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేయనుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: