బాలీవుడ్ లో ఖాన్ సినిమాలంటే ఎంత డిమాండ్ ఉంటుందో కొత్తగ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిస్టర్ పర్పెక్ట్ అమిర్ ఖాన్ సినిమాలకు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటుంది.  సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ అమీర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు.  ఈ సంవత్సరం రిలీజ్ అయిన ‘దంగల్’సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మద్య  చైనాలో భారతీయ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటుంది.
Image result for dangal movie
అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’చైనాలో  7వేల స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదలైంది. సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించే చైనా మార్కెట్లో బాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటాయని ఆమిర్ ఇప్పటికే నిరూపించారు. గతంలో . 3 ఇడియట్స్ సినిమాను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేసినప్పటి నుంచి ఆమిర్ ఖాన్ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ కనిపిస్తోంది.
Image result for dangal movie
పీకే సినిమా కూడా కేవలం చైనా బాక్సాఫీసులోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది.  దేశీగడ్డపై ఓ భారతీయ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. చైనాలో మొత్తం 40 వేల థియేటర్లు ఉండగా.. అందులో 25శాతం థియేటర్లలో దంగల్ సినిమా ఆడుతున్నదన్నమాట. గత నెలలో ఈ సినిమాను బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. చైనా కొత్త సంవత్సరం సమయంలో వచ్చిన జాయింట్ ప్రొడక్షన్ సినిమాలు కుంగ్‌ఫూ యోగా, బడ్డీస్ ఇన్ ఇండియా లాంటి సినిమాలకు కూడా అక్కడ మంచి ఆదరణ కనిపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: