నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో వచ్చిన కొత్తచిత్రం ‘బాబు బాగా బిజీ’. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో నటించారు. ‘బాబు బాగా బిజీ’ చిత్రం అడల్ట్ కామెడీ నైపథ్యంలో ఉండే బాలీవుడ్ సినిమా‘హంటర్’ కు రీమేక్ గా వచ్చింది. అయితే ఈ చిత్రంపై యూత్ లో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో అన్ని కసి కసిగా ఉండే సీన్స్ ఉంటాయని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు.


దీంతో ఈ మూవీ రిలీజ్  రోజున ఎక్కువమంది యూత్ అక్కడే కనిపించారు. అన్ని థియోటర్స్ లో ఈ మూవీ 100 శాతం ఆక్యుపెన్సీని చూపించింది. అయితే ‘బాబు బాగా బిజీ’ చిత్రంను చూసిన యూత్ పూర్తి నిరుత్సాహంతో బయటకు వచ్చారు. ‘బాబు బాగా బిజీ’సినిమాలో బూతు ఎంటర్టైన్మెంట్  ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన వారికి…సినిమా బోరింగ్ అనిపించింది. ట్రైలర్, పోస్టర్లు కూడా కాస్తంత హాట్ గా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ని తెచ్చింది.


అయితే భిన్నమైన కథతో వచ్చి…అడల్ట్ కామెడీ కంటెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి…‘బాబు బాగా బిజీ’ మంచి బిజినెస్ చేసుకుంది. కానీ సినిమాని చూస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో కథ పక్క ట్రాక్ పట్టడం అనేది ప్రేక్షకులని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ కచ్ఛితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కానీ రిజల్ట్ అందుకు భిన్నంగా రావటంతో తన సన్నిహిత ఫ్యాన్స్ కి పర్సనల్ గా అవసరాల సారీ చెప్పుకున్నాడని అంటున్నారు.


మొత్తంగా‘బాబు బాగా బిజీ’ చిత్రం ప్రేక్షకులను మోప్పించలేకపోయిందని అంటున్నారు. కొంత మంది ఇదంతా ట్రైలర్ కారణంగానే అని అంటున్నారు. ట్రైలర్ సాధారణంగా ఉంటే.. ‘బాబు బాగా బిజీ’ చిత్రంపై ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ చేసేవారేమో. కానీ ట్రైలర్ హై ఎక్స్ పెక్టేషన్స్ కి తీసుకువెళ్ళటంతో…సినిమా డల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: