వరస విజయాలతో మంచి జోష్ పై ఉన్న శర్వానంద్‌ మరో సూపర్ హిట్ పై కన్ను వేసి నటించిన ‘రాధ’ వచ్చేవారం విడుదలకాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి రేస్ కు వచ్చిన శర్వానంద్‌ 'శతమానం భవతి' భారీ విజయాన్ని అందుకోవడంతో 'రాధ' చిత్రం హక్కులని ఫ్యాన్సీ రేట్లకు మన ఇరురాష్ట్రాలలోని బయ్యర్లు భారీ ఆఫర్లు ఇచ్చి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే వచ్చే వారం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ విషయంలో ఈ సినిమా నిర్మాతలు పెద్దగా  శ్రద్ధ పెట్టడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని  మే నెలకి వాయిదా వేసిన నిర్మాతలు అప్పట్నుంచి పబ్లిసిటీ పరంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

దీనికితోడు ఈ సినిమాకు ఎటువంట ఆడియో ఫంక్షన్‌ కూడ చేయకుండా పాటలు డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలేయడం మరో మైనస్ పాయింట్ గా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనం ‘బాహుబలి 2’ గురించి కాకుండా మరో సినిమా గురించి పట్టించుకునే స్థితిలో లేని నేపధ్యంలో శర్వానంద్ నటించిన ‘రాధ’ మూవీ పై అనుసరిస్తున్న ఈవ్యూహం సరైనది కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.  

తెలుస్తున్న సమాచారం మేరకు `రాధ‌` మూవీ కూడా కంప్లీట్ ఎంట‌ర్‌ టైన‌ర్ మూవీ అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలోని శర్వానంద్ కామెడీ టైమింగ్ పై ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌’, ‘రేసుగుర్రం’ లోనిసీన్స్ ప్రభావం కనిపిస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ‘బాహుబలి’ మ్యానియా నుండి ప్రేక్షకులను ఎంత వరకు శర్వానంద్ తన వైపు తిప్పుకుంటాడు అన్న విషయం మై ఈ సినిమా విజయం ఆధార పడి ఉంటుంది. 

ఈసంవత్సరం మొదట్లో చిరంజీవి బాలయ్యల సినిమాల మధ్య ఏమాత్రం వారిద్దరికీ తీసిపోకుండా విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. మరి ఈ ‘బాహుబలి 2’ మ్యానియా తగ్గక ముందే మొట్టమొదటి హిట్ అందుకునే రికార్డ్ ఈసారి కూడ శర్వానంద్ అందుకుంటాడో లేదో చూడాలి...



మరింత సమాచారం తెలుసుకోండి: