ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్...తన కంటే వయస్సులో పెద్ద అయిన హాట్ బ్యూటీ మలైకా అరోరా తో రిలేషన్ మెయిన్ టెన్ చేస్తున్నాడనే న్యూస్ అంతటా వినిపిస్తుంది. గత అయిదు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఈ రిలేషన్ ఉందని అంటున్నారు.


దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎప్పుడూ మీడియా కంట పడలేదు. తరుచూ వీరిద్దరూ ప్రవైట్ పార్టీలకు హాజరవుతారని ఉంటారు. మలైకా అరోరా తో అర్జున్ కపూర్ ఇంతలా కలిసి ఉండటం అనేది నిజంగా ఫిల్మ్ సెలబ్రిటీలకి సైతం ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు. ఇక తాజాగా ఓ అర్థ రాత్రి సమయంలో అర్జున్ కపూర్ మలైకా ఇంటి నుంచి కారులో వెళుతూ కనిపించిన ఫొటోలు అంతటా బయటకు వచ్చాయి.


బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా అరోరా తరువాత నుండి అర్జున్ కపూర్ తో కలసి ఉంటోందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మలైకా అరోరా కూడ స్పందించింది. తను స్పంధించిన దాంట్లో అర్జున్ కపూర్ తో రిలేషన్ లేదని మాత్రం చెప్పకుండా...ఇంతకన్నా మంచి విషయాలు మాట్లాడుకోవటానికి ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు.


దీంతో మలైకా అరోరా మాటలు ఇంకా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ పై మరింత బలాన్ని చేకూర్చాలా చేసిందని అంటున్నారు. యంగ్ హీరో అర్జున్ కూపర్ కెరీర్ ప్రస్తుతం ఓ దారిలో పడుతుంది. ఇటువంటి సమయంలో సీరియర్ ఆర్టిస్ట్ లో తనకు రిలేషన్స్ ఉన్నాయనే విషయం తన కెరీర్ పై ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంటుందని అంటున్నారు. దీనిపై అర్జున్ కపూర్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: