హీరో అర్జున కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయిన ‘ఒకేఒక్కడు’ సినిమాను ఇప్పటికి కూడా టివి చానల్స్ లో ప్రసారం అవుతున్నప్పుడు వదిలి పెట్టకుండా చాలామంది చూస్తూనే ఉంటారు. టాప్ డైరెక్టర్ శంకర్ కు ఎంతో పేరుతెచ్చి పెట్టిన సినిమా ఇది. ఒక్కరోజు సి.మ్. గా అర్జున్ చేసిన యాక్షన్ అప్పట్లో సూపర్ హిట్. అయితే ఆ సినిమాకు స్పూర్తిని ఇచ్చిన పాత్ర ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అట.

ఈ మాట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు, కానీ ఈ మాటలు అన్నది స్వయానా చంద్రబాబు నాయుడే అవడంతో అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిన్న చంద్రబాబు తన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రకు సంబందించిన విశేషాలతో జర్నలిస్ట్ శ్రీనివాస్ రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో బాబు మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి ఐన కొత్తలో ప్రజల వద్దకు తాను వెళ్ళడం చూసి ప్రభావితమై దర్శకుడు శంకర్ ‘ఒకేక్కడు’ సినిమాను నిర్మించాడని చెపుతూ అలనాటి తన గతాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా అంత సూపర్ హిట్ అవడానికి తానే కారణం అని కూడా చెప్పారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన కధలు దొరకక ఇబ్బంది పడుతున్న నిర్మాతలు చంద్రబాబు నాయుడు జీవితాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తే మరన్ని సంచలనాత్మకంగా కధలు దొరికే అవకాశం ఉంది కాబట్టి ఆ తరహలో మన దర్శకులు ఆలోచిస్తే మరో సూపర్ హిట్ సినిమాకు కధ దొరికే అవకాశాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: