మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ విషయంలో కీలక మార్పులు జరుగుతున్నాయనేది తాజాగా తెలుస్తున్న సమాచారం.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో స్టార్ యాక్టర్ రానా నటించనున్నారని అంటున్నారు. మెగాస్టార్ 151వ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దీంతో సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక బాహుబలి2 సాధించిన కలెక్షన్స్ వివరాలను చూసుకుంటే...ఈ మూవీ ఇప్పటికే 1100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

దీంతో తెలుగు సినిమాకి మంచి ఆధరణ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగానే మెగాస్టార్ సినిమాని సైతం భారీగా తెరకెక్కించి...అత్యధిక థియోటర్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే...‘బాహుబలి’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటిని ఈ మూవీలో విలన్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్రపోజల్ ని రానా వద్దకు తీసుకువెళ్లారు. అయితే రానా పర్సనాలిటికీ...చిరు పర్సనాలిటీకి చాలా తేడా ఉంటంది. యంగ్ హీరోలకి సంబంధించిన మూవీలో విలన్ అయితే రానా పాత్రకి మంచి గుర్తింపు వస్తుంది. కానీ చిరు సరసన విలన్ అంటే తన పాత్ర అంతగా ఎలివేట్ కాదని రానా భావిస్తున్నాడు. దీంతో చిరు మూవీలో తను నటించేది లేదు అని స్పష్టంగా చెప్పుకొచ్చారు. దీనికి మెగాస్టార్ ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: