తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప ఇమేజ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం చిత్ర టీజర్  ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తుంది.  పూర్తి యాక్షన్ మోడ్ లో రూపొందిన వివేగం టీజర్ దుమ్మురేపుతోంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు.  

అజిత్ .. దర్శకుడు శివ కాంబినేషన్లో వస్తోన్న మూడవ సినిమా ఇది.  సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.  

గత కొంత కాలంగా తెలుగులో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ప్రస్తుతం తన ద్రుష్టి అంతా తమిళనాడు మీదే పెట్టాడు పైగా వరుసగా అజిత్ తో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు కొట్టేస్తున్నాడు.  రిలీజ్ అయిన 12 గంటలలో ఈ చిత్ర టీజర్ కి 3 మిలియన్ల పైనే వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు కబాలి చిత్రంపైనే ఈ రికార్డు ఉంది.

తాజాగా వివేగం టీజర్ దీనిని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ మూవీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ప్రస్తుతం వివేగం టీజర్ హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ టీజర్ పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఈ చిత్ర టీజర్ మానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: