ఈరోజు ఉదయం విడుదలైన శర్వానంద్ ‘రాధ’ సినిమాను చూసిన ప్రేక్షకులు విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమా సరదాగా ఉంది అని చెపుతూ ప్రస్తుతం హిట్ ట్రాక్ పై దూసుకుపోతున్న శర్వానంద్ కు ఈ సినిమా ద్వారా మహేష్ అదృష్టం కూడ వెంటాడింది అన్న ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక ఒక కారణం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ‘బాహుబలి’ పార్ట్ వన్ విడుదల అయ్యాక ఆసినిమా అప్పట్లో సృష్టించిన సునామీతో ‘బాహుబలి’ తరువాత వేరే సినిమాలు వచ్చినా నిలబడతాయా అంటూ సందేహాలు వ్యక్త పరిచారు. 

అయితే ‘బాహుబలి’ సునామీ కొనసాగుతూ ఉండగానే ఒక నెల గ్యాప్ తో అప్పట్లో మహేష్ ‘శ్రీమంతుడు’ విడుదలై మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మారింది. ఇప్పుడు ఈరోజు విడుదలైన ‘రాధ’  సినిమాకి మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ తో పోలిక పెడుతున్నారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.  

మహేష్ ‘శ్రీమంతుడు’ అప్పట్లో ‘బాహుబలి’ హవాను ఎదిరించి 85 కోట్ల వరకు కలక్షన్స్ వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో కాకపోయినా ఈరోజు విడుదలైన శర్వానంద్ ‘రాధ’ కు హిట్ టాక్ రావడంతో ఈసినిమా కూడ హిట్ అయినట్లే అనుకోవాలి అని అంటున్నారు. 

అయితే ఈ సినిమా పూర్తి టాక్ ఇంకా బయటకు రాకపోయినా ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ హీరోగా రాణిస్తున్న శర్వానంద్ కు ఈ ‘రాధ’ హిట్ ను అందించినట్లే అనుకోవాలి అంటూ ప్రాధమీక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే శర్వానంద్ ను మహేష్ అదృష్టం వెంటాడుతోంది అని అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: