Image result for bahubali 2 images with collections



బాహుబలి-2 ది కంక్లూజన్ జైత్ర యాత్ర ఇంకా ముందుకు సాగిపోతూనే ఉంది. దీన్ని కొంతకాలం ఏవరూ ఆపలేని పరిస్థితి నెలకొంది. ఉప్పెనను ఏవరాపగలరు. విడుదలైన తొలి రోజు అదే ఏప్రిల్ 28 నుంచి ‘బాహుబలి-2 ది కంక్లూజన్’ చిత్ర రంగములోనే ప్రకంపనలు రేపుతూ సాగిపోతోంది. ఇప్పటికే ఇండియన్ సినిమా కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. అలాగే రోజుకో కొత్త మైలురాయిని సృజిస్తూ మెత్తగా విజయాల పరంపర కొనసాగిస్తూ ధీరగంభీరంగా ప్రవహిస్తుందీ సినిమా. 


వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల కలెక్షన్లను తొలి వారం లోనే సాధించిన భారతీయ చిత్రం గా ‘బాహుబలి-2’ తన రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా చెప్పబోయే విశేషం ఏంటంటే "బాహుబలి -2, ది కంక్లూజన్ - సినిమా పూర్తిగా భారత్ లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం. ‘"బాహుబలి -2, ది కంక్లూజన్’ నాలుగు భాషల వసూళ్లు కలిపి ఇండియాలోనే రూ.1000 కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి.


ఇందులో తెలుగు వెర్షన్ మాత్రమే రూ.300 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయగా, హిందీ వెర్షన్ వసూళ్లు రూ.400 కోట్లు, తమిళ.. మలయాళ వెర్షన్లు చేసిన వసూళ్ళు కలిపితే  రూ.1000 కోట్ల గ్రాస్ పూర్తయింది. ‘బాహుబలి-2’ విశ్వవ్యాప్త వసూళ్లు రూ.1300 కోట్ల కు చేరువగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ వీకెండ్లో వంద కోట్లవరకు కొత్తగా వసూళ్ళు రానున్నాయని విశ్లేషకుల అంచనా. ఫుల్-రన్లో ఈ సినిమా రూ.1500 కోట్ల మార్క్ లేదా గమ్యాన్ని చేధించగలదని నిశ్చితంగా తెలుస్తుంది.  


ఇప్పుడిప్పుడే ‘బాహుబలి-2 ది కంక్లూజన్’ ముద్రించిన రికార్డు బ్రద్దలవడం అసాధ్యమే. అమెరికాలో మాత్రమే ‘‘బాహుబలి-2 ది కంక్లూజన్’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం లండన్, దుబాయ్ లాంటి చోట్ల కూడా ‘బాహుబలి-2 ది కంక్లూజన్’ వసూళ్లు అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. రూ.200 కోట్ల మార్కును చేధించే దిశగా ముందుకు నడుస్తుందటం ఒక విశేషం. 


Image result for bahubali 2 images with collections

మరింత సమాచారం తెలుసుకోండి: